Pahalgam Video Viral: భయం,బాధ ఆందోళన గుండెలను పిండేసే ఈ వీడియో పహల్గాం బైసరిన్ వ్యాలీలో నిన్న జరిగింది. ఈ ఉగ్రవాదుల కాల్పుల సమయంలో భయంతో అక్కడున్న టూరిస్టులు ప్రాణాలతో వణికిపోయారు. అక్కడి కొండలు, గుట్టలలో పరిగెత్తుకుంటూ వచ్చి ఓ చోట కుప్పకూలిపోయారు. కళ్ల ముందే భర్తలు, బంధువులు, ఫ్రెండ్స్‌ను కోల్పోయిన బాధ గుక్కపెట్టి ఏడ్చారు. కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీని చూసి కూడా భయపడ్డారు. చంపొద్దు అని వేడుకుంటున్నారు. గుండెలను పిండేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పహల్గాంలో బైసరిన్ వ్యాలీలో టూరిస్టులపై ఉగ్రవాదులు తమ దుశ్చర్య ప్రదర్శించారు. ఐడి కార్డులను చెక్ చేయడంతో పాటు మగవారి ప్యాంట్లు విప్పి మరీ మతాన్ని తెలుసుకున్నారు. వారితో కల్మాను కూడా చదివించి ముస్లింలు కాని వారిని దారుణంగా చంపేశారు. భర్తలను కోల్పోయిన మహిళల కన్నీటి వీడియోలు నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఉగ్ర దాడిలో విశాఖ వాసి కూడా చనిపోయారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అయిన చంద్రమౌళిని మరో కావలి వ్యక్తిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. సహచరు టూరిస్టులు ఈ విషయాన్ని ధృవీకరించారు. చంపొద్దు అని వేడుకున్న వదల్లేదు పారిపోతుంటే వెంటాడి మరీ కాల్చి చంపారని తెలిపారు.
భారత ప్రధాని మోదీ ఆకస్మికంగా సౌదీ పర్యటనను ముగించుకొని ఇండియాకి వచ్చేసారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై నేడు మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రితో సమావేశం కానున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుతిన్‌తోపాటు పలు దేశాలు భారత్‌కు సంతాపం తెలియజేశాయి. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా తాము పోరాడుతామని భారత్‌తో ఉంటామని తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమిక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఇలాంటి ఉగ్రదాడి మాత్రం దేశంలోనే తొలిసారి అని చెప్పొచ్చు ఎందుకంటే టెర్రరిజానికి మతం లేదంటారు కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వాన్ని మతం ప్రామాణికం అయింది మతాన్ని తెలుసుకోమని దారి చేయడం తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్ము కాశ్మీర్‌లో మతచిచ్చు రేపి భారత్ అంత విస్తరించడమే ఈ ఉద్దేశం అని అంచనా వేస్తున్నారు. ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. వీళ్లకు పాజిటివ్ వైబ్స్, ఈ రాశికి ఉక్కిరిబిక్కిరి..
ఈ ఉగ్రదాడి పహల్గాంలో జరిగిన ఈ పాషవిక ఉగ్రదాడి వెనుక ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) ఉన్నట్లు సమాచారం. పాక్‌కు చెందిన ఈ లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ ఆర్టికల్ 370 తర్వాత 2019 ఆగస్టులో ఏర్పాటైంది. షేక్ సాజిద్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. కేంద్రం 2023లో దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కూడా తీశారు.
ఈ దాడి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకొని చంపేయాలని వారికి భూమిపై జీవించే హక్కు లేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









