)
Panchmukhi Nag Original Video Watch: నాగుపాములకు సంబంధించిన వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. కానీ ఇటీవలే ఓ నాగదేవత గుడిలో ప్రత్యక్షమైన ఐదు తలల నాగుపాము సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆ దేవాలయానికి ఈ అరుదైన దృశ్యాలు చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారట. సాధారణంగా మనం సోషల్ మీడియాలో ఒకతలకు సంబంధించిన నాగుపామును మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు ఐదు తలల నాగుపామును చూడొచ్చు. ఈ అద్భుతమైన దృశ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయి భక్తిలో మునిగిపోతున్నారు..
ఐదు తలల నాగుపాము దర్శనం కేవలం కంటికి ఇంపుగా కలిగించడమే కాకుండా.. దీని వెనక ఒక ఆధ్యాత్మిక విశ్వాసం కూడా ఉందని కొంతమంది భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా వీడియోలో తెలిపిన సమాచారం ప్రకారం.. ఐదు తలల నాగుపాములు దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషం సులభంగా తొలగిపోతుందట. అందుకే ఈ ఐదు తలల నాగుపామును చూసేందుకు ఆ దేవాలయానికి భక్తులు బారులు పెడుతున్నారని వీడియోలో పేర్కొన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం అనేది ఒక కఠినమైన దోషంగా పరిగణిస్తారు.. ఈ దోషంతో బాధపడేవారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారట.. అలాంటిది ఈ ఐదు తలల నాగుపామును దర్శించుకోవడం వల్ల వాటన్నిటి నుంచి విముక్తి పొందుతారని వీడియోలో తెలిపారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నాగసర్పదోషంతో బాధపడుతున్న భక్తులకు గొప్ప వరంగా మారింది. అలాగే చాలామంది నేరుగా నాగదేవత గుడికి వెళ్లి పాములను పూజిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేయడమే కాకుండా కొంతమంది పాములను మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఈ పాములకు పూజలు చేసే క్రమంలో వీడియో చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలకు నాగదేవత మహిమలు.. ఆమె ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి