)
Lord vitthal face spotted on cobra Snake in Maharashtra field video: మహారాష్ట్రలో పండరీపురంలో కొలువైన పాండు రంగడ్ని చాలా మంది ఎంతో భక్తితో కొలుచుకుంటారు. కార్తీక మాసంలో, ఆషాడ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మహారాష్ట్ర అంతట కూడా పాండురంగడ్ని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. అయితే.. ఆ పాండు రంగడి ప్రతిరూపం ఒక పాము పడగలో కన్పించడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికంగా పంట పొలాల్లో కొంత మంది తమ పనులు చేసుకుంటున్నారు. ఇంతలో వారికి ఒక నాగు పాము కన్పించింది. అది పడగవిప్పీ మరీ బుసలు కొడుతుంది. పొలం పనిచేసే వారు పామును జాగ్రత్తగా చూడటంతో దాని పడగలో విఠలేశ్వరుడి ప్రతిరూపం కన్పించింది. దీంతో వారంతా పాండు రంగ...విఠల.. అంటూ అక్కడ భక్తితో పులకరించిపోయారు.
అంతేకాకుండా తమ ఇష్టమైన దేవుడు తమను అనుగ్రహించడానికి పాము రూపంలో వచ్చాడని అక్కడి రైతులు, స్థానికులు భక్తితో పొంగిపోయారు. కొంత మంది ఈ అరుదైన సర్పాన్ని వీడియో తీసుకున్నారు.
ఇది దేవతా సర్పమని చాలా మంది నమస్కరించారు. ఏకంగా పండరీపూరంలో ఉన్న దేవుడు తమ కోసం వచ్చాడని స్థానికులు భక్తితో పొంగిపోయారు. ఈ క్రమంలో నాగుపాము వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అచ్చం పాండు రంగడి ప్రతిరూపం పాము పడగ మీద ఉందని కూడా భక్తితొ పొంగిపోతున్నారు.