Pastor Praveen Pagadala CCTV Footage: పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటా? కుట్రా కోనమా? అపి పలువురి అనుమానం. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహం పడి ఉండటంతో పలు అనుమానులకు దారితీస్తుంది. ఆయన డెడ్ బాడీ హెల్మట్‌తో అలాగే జాతీయ రహదారిపై పక్కన పడి ఉంది. అయితే, ముఖంపై తీవ్ర గాయాలు అవ్వడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఇక ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఈ వీడియో ఫుటేజీ రాత్రి 11:30 సమయంలో కొవ్వూరు టోల్గేట్ వద్ద రికార్డు అయింది. బుల్లెట్ బైక్ నడుపుతూ ఆయన వెళ్లారు. ఆ వీడియో సీసీ కెమెరాలు రికార్డు అయింది. అందులో ఆయన హెడ్ లైట్ వెలగడం లేదు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు. సీసీ టీవీ రికార్డు అయినా ప్రదేశంలోని కొద్ది దూరంలోనే ఆయన విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయనది హత్యా? లేదా ప్రమాదమా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రవీణ్ పగడాల హత్య కేసులో కుట్ర కోణం ఉందేమో అని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. అయితే అక్కడ సీసీ టీవీ ఫూటేజీలో మొత్తానికి ఏదో జరిగినట్టు కనిపిస్తుంది. కానీ వీడియో స్పష్టంగా లేదు. వెనుక నుంచి వాహనాలు వస్తూనే ఉన్నాయి. అయితే బుల్లెట్‌ను ఏదైనా వాహనం ఢీ కొట్టిందా? ఆయన ఎందుకు హెడ్ లైట్ వేసుకోలేదు? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఆ ప్రదేశంలో పెద్ద శబ్దం రావాల్సి ఉంది. కానీ యథావిధిగా వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఏ చడీ చప్పుడు కాకుండా వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు.
ఇదీ చదవండి: Facial: ఇంట్లోనే కాఫీ ఫేషియల్.. ఖర్చులేని కాంతివంతమైన స్కిన్..
సీసీ టీవీ ఫుటేజ్ రికార్డు అయిన కొద్ది దూరం ప్రాంతంలోనే ఆయన డెడ్ బాడీ పడి ఉంది. రాత్రంతా అలాగే ఆయన బాడీ ఉంది. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆయన ఎలా చనిపోయారు అన్నదానిపై ఇంకా పోలీసులు నిర్ధారణకు రాలేదు. బుల్లెట్ బండికి కూడా అక్కడక్కడ గీతాలు పడ్డాయి. అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ పగడాల పెట్టుకున్న హెల్మెట్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ప్రమాద స్థలంలో ఆయన హెల్మెట్ తో పాటుగా కిందపడి ఉన్నాడు. అంతేకాదు అక్కడున్న స్థానికుల సమాచారం ప్రకారం ఆయనపై ఏదో దాడి జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఈ కేసు పై దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చివరగా పోలీసులు కేసును తేల్చే వరకు ఇది హత్య? ప్రమాదమా? తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: Raw Banana: పచ్చి అరటికాయ తింటే ఈ రోగాలు ఫసక్.. ఆ జబ్బులు జన్మలో రావు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









