Peacock saves kid from road accident video: ఇంట్లో చిన్న పిల్లలుంటే చాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎల్లప్పుడు వాళ్లను గమనిస్తునే ఉండాలి. పొరపాటున వదిలేస్తే, చూస్తుండగానే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిపోతాయి. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పల్లా చూసుకుంటారు. అస్సలు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండరు . కానీ కొన్నిసార్లు ఏవే పనుల్లో బిజీగా ఉండి పిల్లల్ని ఇంట్లో వదిలేస్తారు. అప్పుడు పిల్లలు కొంత మంది ఉన్న చోటనేఆడుకుంటారు.
కానీ మరికొందరు మాత్రం.. ఒక చోట అస్సలు ఉండరు . నెల మీద పాకుకుంటూ ఎంత దూరమైన వెళ్లిపోతారు. ఈ క్రమంలో అనుకొని ప్రమాదంలో చిక్కుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక బుడ్డొడు చేస్తున్న హల్ చల్ నెట్టింట తెగ వైరల్గా మారింది. సాధారణంగా చాలా మంది మూగ జీవాలను కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. కొన్నిసార్లు మూగ జీవాలు కూడా మనుషుల కన్నా గొప్పగా ప్రవర్తిస్తుంటాయి.
जाको राखे सांइया, "मार "सके ना कोय!
पक्षी भी कितने समझदार हो सकते हैं?? pic.twitter.com/gpSnxISCMQ— राजस्थान वाले योगी बाबा?? (@FROM_GORKH_BABA) March 25, 2025
మనుషులు సాటి మనిషి ఆపదలో ఉన్నాడంటే.. అస్సలు పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు మూగజీవాలు తమ ముందు ఎవరైన ఆపదలో ఉంటే స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో వైరల్ గా మారాయి. తాజాగా.. ఒక ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఒక బుడ్డొడు పాకుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. ఇంతలో అతడ్నివెనకాల ఒక నెమలి వచ్చింది. అది అతని దగ్గరకు వెళ్లి అడ్డుగా నిలబడింది. ఇంతలో వేగంగా ఒక వాహనం వచ్చింది.
Read more: Choti Monalisa Video: వావ్.. ఛోటీ మోసాలీసా దొరికిపోయిందోచ్.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
నెమలిని చూసి అతను మెల్లగా వెళ్లిపోయాడు. నెమలి పురివిప్పుకుని బుడ్డొడికి అడ్డంగా నిలబడి.. ఎలాంటి ప్రమాదం కాకుండా.. కాపాడింది. ఆ తర్వాత రోడ్డుపక్కన బుడ్డొడ్ని వెళ్లేలా చేసింది. మరీ ఆ నెమలికి , ఆ బుడ్డొడికి ఉన్న అనుబంధం ఏంటో.. కానీ అది మాత్రం పిల్లాడి ప్రాణాలు కాపాడింది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter








