Petdog attacks on cobra: చాలా మంది తమ ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటారు. అవి ఎంతో విశ్వాసంతో ఉంటాయి. కుక్కలు తమ యజమానుల్ని విడిచి ఎక్కడకు వెళ్లరు. శునకాల్ని పెంచుకుంటున్న వాళ్లు సైతం..వాటిని తమ ఇళ్లలో ఒక మెంబర్ లా చూసుకుంటారు. వాటికి మంచి ఫుడ్ పెడతారు. డాక్టర్ లకు తీసుకెళ్తారు. ఎల్లప్పుడు కూడా శునకాల్ని కాపాడుకుంటు ఉంటారు.
అంతేకాకుండా.. శునకాలు తమ ఓనర్ కన్పించకపోతే.. కన్నీళ్లు పెట్టుకుంటాయి. అదే విధంగా కొత్తవారు ఇంట్లోకివస్తే వాళ్లను అలర్ట్ చేస్తాయి. మనుషులే కాదు.. కోతులు ఇతర జంతువులు, విషపూరీమైన జీవాలు ఏమివచ్చిన కూడా కుక్కులు వాటిని ఇంటి దరిదాపుల్లోకి రానివ్వవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాము .. చెట్లలో నుంచి ఒక ఇంటిలోకి ప్రవేశించింది. అక్కడ పెంపుడు కుక్కకాచుకుని ఉంది.
పామును గమనించిన కుక్క.. దాని మీదకు దాడికి దిగింది. గట్టిగా అరుస్తు పాముపైన దాడికి పాల్పడింది.పదునైన పళ్లతో పామును కొరికింది.అంతేకాకుండా.. పాము వచ్చినవిషయాన్ని గట్టిగా అరుస్తు తన ఓనర్ ను సైతం అలర్ట్ చేసింది. ఆ తర్వాత పామును తన పదునైన పళ్లతో కోరికి గాయపర్చింది. పాము కూడా బుసలు కొడుతూ కుక్కను ప్రతిఘటించింది.
Read more: Hyderabad: హైదరాబాద్‌లోని శివాలయంలో మరో ఘోరం.. ఏకంగా శివలింగంపై కాలుపెట్టి మరీ.. వీడియో వైరల్..
కానీ ఇంతలో పాము మాత్రం కుక్క దాడి నుంచి తప్పించుకోలేక పోయింది. అదిపదునైన పళ్లతో దాడి చేయడంతో పాము విలవిల్లాడుతూ చనిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. శునకం ఓనర్ ఆపేందుకు ప్రయత్నించిన అది ఆగలేదు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటవైరల్గా మారింది.









