)
Pet Dog Creeping like Tortoise Funny Video: సోషల్ మీడియాలో ఇటీవల ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిలో కొన్ని వీడియోలు చూస్తే నవ్వులు తెప్పించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా విస్తుపోయేలా కూడా ఉంటాయి. చాలా మంది తమ ఇళ్లలో కాపాలా కోసం శునకాల్ని పెంచుకుంటారు. అంతే కాకుండా వాటిని తమ ఇంటిలో ఒకమెంబర్ గా చూసుకుంటారు.
పొరపాటున కూడా దానికి ఏమికానివ్వరు. మంచిఫుడ్, వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్తుంటారు. అవి కూడా తమ యజమాని చుట్టు తిరుగుతూ చాలా విశ్వాసంగా ఉంటాయి. అందుకే చాలా మంది మనుషుల కన్నాకూడా నోరులేనీ జీవాలు బెటర్ అని కూడా చెబుతుంటారు.
శునకాలకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. అవి పేపర్ తెవడం, ఇంట్లోని వస్తువులు చెబితే తీసుకొని రావడం వంటివి చేస్తారు. అవి కూడా చాలా సార్లు ఇంట్లో వాళ్లను ఇమిటెట్ కూడా చేస్తాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఇంట్లో తాబేలు, శునకంను పెంచుకుంటున్నారు.
అయితే.. అవి రెండు కూడా ఎంతో కలిసి మెలిసి ఉంటున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తాబేలు పాకడం కామన్. కానీ మరీ శునకంకు ఏమన్పించిందో ఏంటో కానీ... అది అచ్చం తాబేలులా పాకుతూ వెళ్లే ప్రయత్నం చేసింది. తాబేలు పక్కనే అచ్చం..దానిలా పాకుతూ కాపీ కొట్టింది. తన సహజ స్వభావం మర్చిపోయి కొంత సేపు తన ఫ్రెండ్ లా చేసింది.
ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గామారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అందుకే పెద్ద వాళ్లు తరచుగా మనం ఎవరితో మాట్లాడుతాం.. ఎవరితో ఉంటామో.. వాళ్ల ప్రభావం మన మాటలు,నడవడిక మీద పడుతుందని అంటారు. అందుకే మనం ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నామో అని కూడా మన లైఫ్ మీద ప్రభావం చూపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.