)
Cobra In Bike Silencer Video: ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల అద్భుతమైన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది జనాలు ఎక్కువగా షార్ట్ వీడియోలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా పాములను పట్టుకుంటున్న వీడియోలు, సంచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కూడా ఓ వీడియో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ బైక్ సైలెన్సర్‌లో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము దూరడం మీరు గమనించవచ్చు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఎవరో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను మొబైల్లో చిత్రీకరించి.. పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియోలో పాము భూమిపై పాకుతూ నెమ్మదిగా టైర్ సహాయంతో పొగ గొట్టం దగ్గరికి వెళ్లింది. అయితే, అది అప్పటికే వెచ్చగా ఉండడంతో పాము అందులోకి దూరడం మీరు గమనించవచ్చు..
ఈ దృశ్యాలను చూసేందుకు అక్కడికి స్థానికులు భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడికి వచ్చి వీడియోలు తీశారు. ఇదే అంశానికి సంబంధించి వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్‌గా మారింది. అయితే, యువకుడు బయటికి వెళ్ళేందుకు బైకును స్టార్ట్ చేయగా అతడికి సైలెన్సర్‌లో పాము కనిపించింది దీంతో వెంటనే స్థానికులను పిలిచి చూపించాడు. స్థానికులు అంతా కలిసి దగ్గర్లో ఉన్న స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. ఆ స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వింత వింత కామెంట్లు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కొంతమందైతే మారుమూల ప్రాంతాల్లో బైకులు బయటపెట్టేవారు తప్పకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు దీనిని కొన్ని వేలమందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది లైక్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook