)
Nagamani Stone Live Video Watch Now Here: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు లక్షల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు మాత్రం నేటిజంసును ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోనే ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను 2023 సంవత్సరంలో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ.. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2023 సంవత్సరం జూన్ నెలలో "ANTIQUE ARTICLES" అనే యూట్యూబ్ ఛానెల్లో నుంచి షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో ప్రమాదకరమైన ఒక నాగుపాము అద్భుతమైన రీతిలో ప్రవర్తిస్తున్న దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో ప్రారంభంలో నాగుపాము పడక విప్పి తన ముందున్న అత్యంత విలువైన నాగమణి వైపే శ్రద్ధగా చూస్తుండడం అందరూ గమనించవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఆ నాగమణి తల తల మెరవడం కూడా మీరు చూడొచ్చు.
నాగమణి (Nagamani Stone) చాలా కాంతివంతంగా మెరవడం వల్ల చీకట్లో ఉన్న పాము కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో నాగుపాము పడకమెప్పి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో చూసిన చాలామంది నాగుపాము ఆ అత్యంత అరుదైన నాగమణికి కాపలాగా నిలిచిందని భావిస్తున్నారు. అలాగే వీడియో పైభాగంలో కూడా స్పష్టంగా నాగమణి అని రాసి దీనిని పోస్ట్ చేశారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆ పాము కేవలం నాగమణిని రక్షించడం కోసమే.. అలా పడక విప్పి కూర్చుని ఉందని సమాచారం..
10 సెకండ్లు నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది ఈ వీడియోను చూసి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిని "ANTIQUE ARTICLES" అనే యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియాలోకి పోస్ట్ చేశారు.. ఇది కేవలం యూట్యూబ్‌లో పోస్ట్ చేసినప్పటికీ ఇప్పుడు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది. ఇలాంటి అరుదైన వీడియోలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. ఇక మరికొంతమంది మాత్రం ఇది నాగమణి కాదని.. ఎవరు కావాలని గ్రాఫిక్స్ చేసి ఇలా పోస్ట్ చేశారని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి