)
King Cobra Guards Eggs Video Viral: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఇందులో చాలా వీడియోలు నెటిజన్స్‌ను ఆకర్శిస్తాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియో అందరినీ ఆకర్శించడమే కాకుండా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ చాలా మంది పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో ఆసక్తి చూస్తున్నారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఓ పాము వీడియో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది.
ప్రకృతిలో అమ్మ ప్రేమకు హద్దులు లేవని నిరూపించే అద్భుతమైన సంఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అందరూ పాములను చూస్తే.. ఎంతో భయంతో వణికిపోతూ ఉంటారు.. కానీ అవి కూడా తమ బిడ్డల కోసం అప్పుడప్పుడూ బయానికి గురవుతాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది.. వర్షం కురుస్తున్నప్పటికీ, ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తన గుడ్లను కాపాడటం భయ, భయంగా అటు ఇటు తిరగడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
పాముల ప్రపంచంలో అత్యంత క్రూరమైనవిగా భావించే కింగ్ కోబ్రా.. ఈ వీడియోలో తనలోని తల్లి ప్రేమను చూపించింది. వర్షంలో తడుస్తూ.. నీటి మధ్యలో తన గుడ్ల వద్ద కూర్చొని రక్షణ కవచంగా నిలబడడం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. గుడ్లు తడవకుండా.. వాటికి ఎలాంటి ప్రమాదం వాటిల్ల కుండా చూసుకుంటూ కదలకుండా ఒకేచోట భయంగా ఆ కింగ్ కోబ్రా ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జంతువుల ప్రేమతో పాటు వాటిలో ఉండే రక్షణ స్వభావం గురించి ఎంతగానో తెలియజేస్తోంది. ఈ వీడియోలో కింగ్ కోబ్రా తన గుడ్లను రక్షించుకోవడానికి చూపించిన ధైర్యం, భయం, తల్లి ప్రేమకు మనిషిలోనూ, పాముల్లోనూ తేడా ఉండదని నిరూపించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో మాములుగా వైరల్ అవ్వడం లేదు.. మనుషులను సైతం కదిలించేలా చేసింది. కింగ్ కోబ్రా సాధారణంగా ఎంతో ప్రమాదకరమైనది. కానీ ఇక్కడ తన పిల్లలను కాపాడుకోవడానికి పడిన తపన నిజంగా ప్రశంసనీయమని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, దీనిని చూసిన మరికొంతమంది AIతో సృష్టించిన వీడియో అని కామెంట్స్ పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి