Python Snake Video Watch: కొండచిలువ పళ్లను ఎప్పుడైనా చూశారా? చూడని వారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే..

Python Snake Video Watch:  ప్రస్తుతం సోషల్ మీడియాలో కొండచిలువ నోట్లో ఉన్న పళ్ళను చూపిస్తున్న వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. చాలామంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 4, 2025, 08:00 AM IST
Python Snake Video Watch: కొండచిలువ పళ్లను ఎప్పుడైనా చూశారా? చూడని వారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే..

 Python Snake Teeth Video Watch Here: సోషల్ మీడియా అంటేనే నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫన్నీ వీడియోలు వైరల్ గా మారితే మరికొన్ని సందర్భాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆసక్తి గల వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. జనాలు కూడా ఇలాంటి వీడియోలను చూసేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. సాధారణంగా పాములకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూస్తూ ఉంటారు.  తాజాగా పాములకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

సాధారణంగా కొండచిలువ పాములు ఎంత ప్రమాదకరమైనవో మీ అందరికీ తెలిసిందే.. చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా వీటి శరీరం మొత్తం ఎంతో శక్తివంతమైన కండరాలను కలిగి ఉంటుంది. అందుకే ఇవి వేటినైనా పట్టుకుంటే వాటిని మొత్తం చుట్టేసి ప్రాణాలు పోయేంతవరకు వదిలిపెట్టవు. ప్రాణాలు పోయిన తర్వాత వాటిని ఆహారంగా మలుచుకుంటూ ఉంటాయి. ప్రమాదకరమైన కొండచిలువ పాములు ఎక్కువగా పక్షుల గుడ్లను పక్షులను తినేందుకు ఆసక్తి చూపుతాయట. ఇందులో భాగంగానే చెట్లపైకి ఎక్కి మరి పక్షులపై దాడి చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొండచిలువలు పెద్ద పెద్ద జంతువులను సైతం కూడా వదిలిపెట్టకుండా దాడి చేసి ఆహారంగా చేసుకుంటాయట. 

 
 
 
 
 

సాధారణంగా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ పాము కు సంబంధించిన పళ్ళను చూడవచ్చు. అయితే ఈ వీడియోలో ఓ ఇద్దరి యువకులు కొండచిలువ తలకాయను పట్టుకొని దాని పళ్ళను వీడియోలు చూపెట్టడం మీరు గమనించవచ్చు. కొండచిలువ నోట్లో నల్లని కవర్ పెట్టి కిందికి నొక్కడంతో దానికుండే పళ్ళు  వీడియోలో ఎంతో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరు యువకులు ఎంతో ప్రమాదకరమైన కొండచిలువను పట్టుకొని అలా చేయడం చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎంతో ప్రమాదకరమైన పాములని తెలిసినప్పటికీ ఇలా చేయడం అంత మంచిది కాదని కొంతమంది అంటున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను ఓ పాములు పట్టి యువకుడి ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News