)
Snake Swallowed Large Sword Viral Video: పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆడవుల నుంచి తప్పిపోయి వచ్చిన పాములను జనావాసాల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా పాములు చనిపోతున్నాయి. అయితే కొంతమంది వీటిని రక్షించేందుకు పాములు పట్టేవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా మంది స్నేక్ క్యాచర్స్ గాయపడిన పాములను కూడా రక్షించి, వాటికి చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే అనే గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే హెగ్డేకు చెందిన గణపతి నాయక్ ఇంట్లో ఓ భారీ నాగుపాము సంచారం చేసింది. ఇదే సమయంలో వారు వినియోగించే కత్తిని ఆ పాము ఆమాంతం మింగేసింది. అయితే దీనిని గమనించిన ఆ కుటుంబ సభ్యులు పశువైద్యుడు అద్వైత భట్‌కు సమాచారం అందించారు. దీంతో ఆతడు అక్కడికి చేరుకుని, పాము ఏదో ఒకటి మింగిని నిర్ధారించి.. క్లుపంగా గమనించి చూడగా.. పొడవాటి 2 అంగుళాలు కలిగిన కత్తిని మింగింది..
కత్తిని మింగిన పాము..#snake #LatestNews #viralvideo pic.twitter.com/N8vOOkKynk
— ThermAone Thermaraz (@thermaraz) June 10, 2025
అయితే పశువైద్యుడు అద్వైత భట్‌తో కలిసి స్నేక్ క్యాచర్ పవన్ నాయక్ ఇద్దరూ కలిసి పామును పట్టుకున్నారు. ఇలా పట్టుకున్న పామును నోట్లో నుంచి డాక్టర్ కత్తిని తీసేశాడు. ఇలా తీస్తుండగా.. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది, ఈ పామును రెస్క్యూ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అడవుల్లో ఎక్కువగా ఆహార కొరత ఏర్పడడం వల్ల చాలా వరకు పాములు జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న పాము కూడా అడవుల నుంచే వచ్చింది. ఇలా పాములు ఏది పడితే అది తిని మరణిస్తున్నాయి. గతంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. కానీ వీడియో ఎంతో ప్రత్యేకంగా భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook