Priest Break Dance Video Viral: శ్రీకాకుళం జిల్లా శ్రీ వసుదేవ్ పెరుమాళ్ ఆళయ 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించారు.. భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని డాన్సులు కూడా చేశారు. అందులో ఏంటి ప్రత్యేకం అనుకుంటున్నారా? ఈ ఉత్సవాల్లో ప్రత్యేకం భక్తులు కాదు.. పూజారి. ఈ వేడుకల్లో ఓ పూజారి చేసిన బ్రేక్ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా ఏ ఆలయానికి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు వంటివి నిర్వహించినప్పు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక పాటలుతో శోభాయాత్ర నిర్వహించడం సాధారణం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓ పూజారి బ్రేక్ డాన్స్ చేస్తూ అదరగొట్టాడు. కానీ అది కాస్త వివాదాస్పదంగా మారింది. పూజారిలే ఈ విధంగా బ్రేక్ డాన్సులు భగవంతుడు ముందు వేస్తే ఇక సాధారణ భక్తుల సంగతేంటి? అని నెట్టింటా కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది పూజారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టుబాట్లు అన్నీ ఎక్కడ పోయాయి? ఆధ్యాత్మిక ఉత్సవాల్లో బ్రేక్ డాన్సులు వేస్తే ఎలా? అని రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పూజారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇదీ చదవండి: మహాశివరాత్రి.. ఖాతాదారులకు అలెర్ట్ ఈ వారం బ్యాంకులు 2 రోజులు బంద్..!
ఇదీ చదవండి: సొరంగం మళ్లీ కూలింది.. 3 రోజులు గడిచినా దొరకని కార్మికుల ఆచూకీ, నేడు ప్రభుత్వం కీలక ప్రకటన..?
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన ఈ పూజారి వీడియో శ్రీకాకుళం జిల్లా పెరుమాళ్ ఉత్సవాల్లో భాగంగా జరిగింది. అందులో రథయాత్ర జరుగుతున్నప్పుడు పూజారులు బ్రేక్ డాన్స్ వేశారు. అందులో ఒక పూజారి మా భగవంతుడు ముందే బ్రేక్ డాన్స్ వేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇది భగవంతుని రథయాత్ర ఊరేగింపులా లేదు.. షూటింగ్ ఏమైనా చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పూజారి ఇలా దిగజారి బ్రేక్ డాన్సులు వేస్తే సాధారణ జనాల సంగతి ఏంటి? అని విమర్శిస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో పై తీవ్ర కామెంట్లు పెడుతున్నారు.
కట్టుబాట్లు ఏమయ్యాయి? మరీ ఇంత దిగజారిపోయి డాన్స్ చేయాలా? అంతగా డాన్స్ వేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డాన్స్ మన సాంప్రదాయాలను అవహేళన చేసినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. అయితే డిజె సౌండ్ లో మధ్య కొంతమంది పూజారులు, స్వామీజీలు, రథయాత్రలో భాగంగా బ్రేక్ డాన్స్ వేశారు. దేవుడి పాటలుతో హోరెత్తించాల్సిన ప్రదేశం ఇలా బ్రేక్ డాన్సులతో అది కూడా పూజారులే ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమంది ఈ పూజారి డాన్స్ ముందు ప్రభుదేవా కూడా పనికిరాడేమో? అని కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









