)
Python Eggs Latest Video Viral: భూమిపై వివిధ రకాల కొండచిలువలు ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని అరుదైన జాతులకు సంబంధించిన కొండచిలువలు చూడడానికి విభిన్న రంగుల్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే, తాజాగా ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ఓ కొండచిలువ గుడ్లను సేకరిస్తున్న వన్యప్రాణి సంరక్షకుడి పై దాడి చేయడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. అలాగే ఈ వీడియోలో కొండచిలువ చూడడానికి తెలుపుతోపాటు పసుపు రంగులో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా పాముల నుంచి గుడ్లను దొంగలిస్తే.. అవి ఊరుకుంటాయా.? అస్సలు ఊరుకోవు.. ఎందుకంటే మనుషుల నుంచి ఏదైనా దొంగిలించినప్పుడు.. మనకెంత కోపం వస్తుందో.. మనకంటే ఎక్కువగా పాములకు కోపం వస్తుంది. ఈ సమయంలో అవి ఏవైనా చేయగలుగుతాయ అనడానికి నిదర్శనమే ఈ వీడియో.. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ఓ కొండచిలువ దగ్గర నుంచి గుడ్లను సేకరిస్తున్న ఓ వ్యక్తిని చూడవచ్చు. అతను ఒక చెక్క ప్లాట్‌ఫారమ్ నేలపై పడుకుని గుడ్లను ఒక్కటి ఒక్కటిగా బయటికి తీయడం చూడొచ్చు.
అతను గుడ్లను చాలా నెమ్మదిగా ఒకదాని తర్వాత మరొకటి బయటకు తీస్తూ ఉన్నాడు. అతడికి అనుకోని సంఘటన ఎదురయింది. అయితే, తన గుడ్లను తీస్తున్నదని ఆ కొండచిలువ భావించి.. కోపం వచ్చి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా మొదటగా దాడి చేసే క్రమంలో అతడికి ఏం కాకపోయినప్పటికీ.. రెండవసారి దాడి చేసే సమయంలో అతడి చెంపకి పాము నోటి భాగం తగిలింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదకరమైన పాముల దగ్గర నుంచి గుడ్లు సేకరిస్తున్నప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది అతను ఇలాంటి జాగ్రత్త లేకుండా.. నేరుగా పాము ఉన్నచోటికి వెళ్లి .. గుడ్లను సేకరించే ప్రయత్నం చేశాడు.
గుడ్లను సేకరించే ప్రయత్నంలో భాగంగానే కోపానికి గురై ఆ కొండచిలువ అతనిపై దాడి చేసింది. లేదంటే దాడి చేసి ఉండకపోయేదని కొంతమంది ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే Jeprehistoricpets అనే ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది వారి అభిప్రాయాలను కామెంట్లలో పంచుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి