Python Snake Video: వామ్మో..మెట్ల గోడపై పాకుతూ వెళ్తున్న కొండచిలువ.. ఈ వీడియో చూసే ధైర్యం మీకుందా..

Python Snake Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కొండచిలువ మెట్ల పై కాకుండా దాని పక్కనే ఉన్న గోడపై పాకుతూ పైనకి ఎక్కడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 23, 2025, 02:57 PM IST
Python Snake Video: వామ్మో..మెట్ల గోడపై పాకుతూ వెళ్తున్న కొండచిలువ.. ఈ వీడియో చూసే ధైర్యం మీకుందా..

Python Snake Viral Video Watch Here: ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. బహుశా  మొబైల్ లేని వ్యక్తులు ఇక ముందు భూమ్మీద లేకపోవచ్చు. పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తప్పకుండా వినియోగిస్తూ ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి ఒక్క వీడియోను చూస్తూ ఉంటారు. ముఖ్యంగా యూట్యూబ్‌తో పాటు instagramలో వైరల్ అయ్యే షార్ట్ లను ఎక్కువగా చూసి ఎందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఏవైనా వీడియోలు షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఎక్కువగా వైరల్ అవ్వడంతో ప్రస్తుతం చాలామంది ఆసక్తికరమైన కంటెంట్‌ను షేర్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే అప్పుడప్పుడు భయంకరమైన పాములకు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. అయితే జనాలు కూడా వీటినే ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది.
 
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల పాములకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాం. ఇందులో చాలా వరకు పాములను రక్షించే క్రమంలో తీసిన వీడియోలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో భారీ కొండచిలువ మెట్ల పక్కనే ఉండే గోడపై పాకుతూ పైకెక్కడం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము యమ స్పీడ్ లో పైకెక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఈ పైథాన్ స్నేక్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. చాలామంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా ఈ కొండచిలువలు అతి ప్రమాదకరమైన పాములుగా చెప్పుకుంటారు. ఈ కొండచిలువ జాతుల్లో ఉండే కొన్ని పాములు చాలా స్పీడ్ గా ఒకచోటి నుంచి ఒక చోటికి చేరుకుంటాయి. అంతేకాకుండా చాలా అరుదుగా మాత్రమే కొండచిలువలు జనావాసాల్లోకి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న కొండచిలువ చాలా అరుదైన జాతికి సంబంధించిందిగా తెలుస్తోంది. అంతేకాకుండా చాలా ప్రమాదకరమైందిగా కూడా సమాచారం.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News