Python Vs Crocodile Video: బాప్ రే.. నీళ్లలో మొసలితో భారీ కొండ చిలువ ఫైటింగ్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Python Video: నీళ్లలో ఉన్న మొసలి దగ్గరకు భారీ కొండ చిలువ వెళ్లింది. దానిపై దాడి కూడా చేసింది. కానీ మొసలి ఒక్కసారిగా తన ప్రతాపం చూపించింది.ఈ భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2025, 06:06 PM IST
  • మొసలిపై దాడి చేసిన కొండ చిలువ..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
Python Vs Crocodile Video: బాప్ రే.. నీళ్లలో మొసలితో భారీ కొండ చిలువ ఫైటింగ్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Python Vs Crocodile Battle In Water Video: సాధారణంగా మొసళ్లు ఎక్కువగా నీళ్లలో ఉంటాయి. నీళ్లలో ఉండగా వాటికి పది ఏనుగుల బలం ఉంటుందంటారు. అందుకే మొసలి నీళ్లలో కన్పిస్తే పెద్ద పెద్ద జంతువులు సైతం.. వాటి జోలికి అస్సలు పొవు. ముఖ్యంగా ఏనుగులు, భారీ సింహాలు, పులులు సైతం... మొసలి కన్పిస్తే వాటి దరిదాపుల్లోకి కూడా అస్సలు పొవు.ఈ క్రమంలో ప్రస్తుతం చాలా జంతువులు అడవిలో నీళ్లు తాగేందుకు వస్తుంటాయి. దీంతో నీళ్లలో మొసళ్లు అదును చూసి మెల్లగా జంతువులపై దాడిచేస్తాయి.

Add Zee News as a Preferred Source

కొన్ని జంతువులు అడవిలో ఒక మార్గం నుంచి మరోక మార్గంకు వెళ్తుంటాయి. అప్పుడు కూడా మొసళ్లు వాటిపై దాడికి దిగుతుంటాయి. ఈ క్రమంలో మొసలి నీళ్లలో బలంగా ఉంటుందో.. నీళ్ల బైటకు వస్తే మాత్రం అంతే బలహీనంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొండ చిలువలు చాలాబలంగా ఉంటాయని విషయం మనకు తెలిసిందే. పొరాపాటున ఏదైన జంతువు లేదా మనిషి కొండ చిలువకు చిక్కితే మాత్రం అంతే సంగతులు. పూర్తిగా చుట్టేసుకుని ఊపిరాడకుండా చేసి మరీ చంపుతుంది.

 

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ కొండ చిలువ నీళ్లలో ఉన్న మొసలితో ఫైటింగ్ కు దిగుతుంది.  మొసలిని చుట్టేసుకుని దాని ప్రతాపం చూపించాలని చూస్తుంది. మరీ మొసలి కూడా ఏమాత్రం తగ్గకుండా.. కొండ చిలువతో ఫైటింగ్ కు దిగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మొసలి కొండ చిలువను తన పదునైన పళ్లతొ పట్టుకుని మరీ దాడికి దిగుతుంది.

Read more: Lovers Romance Video: ఒళ్లు బలిసి.. బెంగళూరు మెట్రో స్టేషన్‌లో లవర్స్ పాడుపని.. వైరల్‌గా మారిన ఛెండాలం.. వీడియో ఇదే..  

కొండ చిలువ కూడా తన బలాన్ని కూడగట్టుకుని మరీ మొసలిని బలంగా చుట్టేసుకుని దాన్ని చంపాలని చూస్తుంది. కానీ రెండు కూడా ఒకదానిపై  మరోకటి దాడి చేసుకుని రెండు కూడా అలిసిపోతాయి. చివరకు రెండు కూడా ఒకదానికి మరోకటి దూరంగా వెళ్లిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. బాప్ రే నీళ్లలో మొసలి.. కొండ చిలువలు భీకరంగా ఫైటింగ్ చేసుకున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News