Radhika Merchant: ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ కుటుంబ వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే అతడి చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొత్త కోడలు రాధికా మర్చంట్‌పై అందరి దృష్టి పడింది. ఆమె ఏం చేసినా.. ఆమె ఎక్కడ ప్రత్యక్షమైనా కెమెరాలు క్లిక్‌మంటున్నాయి.. వీడియోగ్రాఫర్లు బంధించేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె దుమ్మురేపేలా డ్యాన్స్ చేస్తే మరి సోషల్ మీడియా ప్రపంచం ఊరుకుంటుందా? తెగ వైరల్ చేసేయదు. రాధికా మర్చంట్ అంబానీ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఒకరి పెళ్లికి హాజరైన రాధిక అక్కడ డ్యాన్స్‌తో దుమ్ముధులిపేసింది.
Also Read: Beer Price Hike: బీర్ ప్రియులకు గుదిబండ.. భారీగా ధరలు పెంచిన తెలంగాణ
అనంత్ అంబానీ భార్య.. ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ తన స్నేహితులు కృష్ణ పరేఖ్, యశ్ సింఘాల్ సంగీత్‌లో మెరిసింది. ముంబైలోని ట్రైడెంట్ ఒబెరాయ్ ోటల్‌లో జరిగిన ఈ సంగీత్ వేడుకలో అనార్కలీ డిస్కో చలి అంటూ ఉర్రూతలూగే పాటకు రాధికా స్టెప్పులు వేసింది. తన స్నేహితులతో కలిసి రాధికా కొన్ని సెకన్ల పాటు డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. అదిరిపోయే డ్రెస్‌లో రాధికా డ్యాన్స్‌ను చూసిన ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. మరికొన్ని పాటలకు కూడా రాధిక డ్యాన్స్ చేసింది. తానేమీ తక్కువ కాదంటూ రాధిక భర్త అనంత్ అంబానీ కూడా తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. వీరిద్దరి డ్యాన్స్‌తో సంగీత్‌కు ప్రత్యేక ఆకర్షణగా చేసింది.
Also Read: Dating App Fraud: 'వాళ్లను' వదలని సైబర్ నేరగాళ్లు.. 'గే' యాప్‌లతో యువకుడి మోసం
ఈ సంగీత్ వేడుకకు తన భర్త అనంత్ అంబానీతో కలిసి రాధిక హాజరైంది. వెండి రంగు లెహెంగాలో మెరిసిన రాధిక సంగీత్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైమండ్ గాజులు, చెవిపోగులతో కనిపించిన రాధిక ఈవెంట్‌లో అందరి దృష్టి పడేలా చూసుకుంది. రాధిక చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్‌గా మారాయి. నెటిజన్లు రాధికపై కామెంట్లు చేస్తున్నారు. అంబానీ కోడలా మజాకా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








