Raghu engineering College Girl Attacks on lady teacher Video: సాధారణంగా తల్లిదండ్రుల తర్వాత పెద్దలు ఆ స్థానాన్ని గురువుకు ఇచ్చారు. అంతటి పవిత్రమైన స్థానం గురువుది. అందుకు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత కాస్లీ అయిన ఫీజులు కట్టి మరీ మంచి చదువుల కోసం ప్రైవేటు స్కూల్లో, కాలేజీల్లో వేస్తారు. టీచర్లు చెప్పింది తప్పకుండా పాటించాలని, చక్కగా చదువుకొవాలని చెప్తుంటారు. కానీ కొంత మంది విద్యార్థులు మాత్రం చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. చాలా మంది స్కూళ్లకు అని చెప్పి అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.
స్కూల్ డేస్ లోనే ప్రేమలు, ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. అక్కడ టీచర్ లు పాఠాలు చెబితే.. వీళ్లు మొబైల్స్ చూసుకుంటు ఉంటారు. అంతేకాకుండా.. మరికొందరు కాలేజీలు బంక్ కొట్టి మరీ సినిమాలకు, షికార్లకు వెళ్తుంటారు. ఇంకా కొన్ని చోట్ల మాత్రం విద్యార్థుల పట్ల యాజమాన్యాలు కాస్తంత కఠినంగా ఉంటాయి. పిల్లల్ని దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి.
Just... మొబైల్ తీసుకున్నందుకా ఇదంతా...?#IndraSenaReddy pic.twitter.com/Zy0RiGjIDq
— M.INDRASENAREDDY (@indrasena9966) April 22, 2025
కానీ అలాంటి వారిపైన కూడా విద్యార్థులు తమఆనందాలకు అడ్డుపడితే మాత్రం ఎదిరించి, దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. వైజాగ్ లోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలో నిలిచింది. ఇక్కడ కాలేజీలో యువతి మొబైల్ తీసుకుని వచ్చింది. దీంతో అక్కడున్న లేడీ టీచర్ మొబైల్ ను లాక్కుంది.
దీంతో స్టూడెంట్ లేడీ టీచర్ ను ఫోన్ ఇవ్వాలని బెదిరింపులకు దిగింది. ఇంతలో ఆమె మాటవిన్పించుకోలేక పోవడంతో ఏకంగా లేడీ టీచర్ పైన దాడికి దిగింది. చెప్పుతో కొడుతూ.. బండబూతులు తిట్టింది. ఈ క్రమంలో అక్కడున్న వారు వచ్చి ఆమెను అడ్డుకున్నారు.
కాలేజీలో ఈ ఘటన పెద్ద రచ్చగా మారింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు విద్యార్థిని ప్రవర్తన చూసి షాక్ అవుతున్నారు. మరికొందరు ఆమె అలా ఉందంటే.. ఆ పెంపకం గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకా లాభంలేదు.. ఆమెను కాలేజీ నుంచి పంపించి వేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









