Wife Splits Tongue Into Two Pieces: భార్యాభర్తలు అంటేనే తరచుగా గొడవ పడడం.. అపార్ధాలు రావడం ఇప్పుడున్న కాలంలో సర్వసాధారణం.. కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలే భాగస్వాముల ఇద్దరికి ప్రాణాల మీదికి వస్తాయి. మన భారత్లో ఇలా ప్రతిరోజు 10 నుంచి 12 కేసులైన నమోదవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవ దారుణ హత్యలకు దారి తీయడం.. ఇలా తరచుగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా భార్యాభర్తల మధ్య గొడవ ఓ వింత సంఘటనకు దారితీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. తాజాగా ఒక భార్య తన భర్త నాలుకను కొరికి చంపిన వింత ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
భార్య భర్త నాలుకను కొరికి చంపిన సంఘటన రాజస్థాన్‌లోని బకాని పట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం ఈ జంట ఏదో చిన్న విషయంలో గొడవపడ్డారట.. ఆ వాదన కాస్త ప్రతిరోజు గొడవకు దారితీసిందట.. ఎంతో కోపానికి గురైన భార్య చివరకు తన భర్త నాలుకను కొరికి చంపేందుకు ప్రయత్నించింది.. ఈ ఘటన గురువారం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..బకానీ పట్టణానికి సంబంధించిన కన్హయ్యలాల్ సైన్ (25).. ఏటి సంవత్సరాల క్రితం సునేల్ గ్రామానికి సంబంధించిన రవీనా సైన్ పెళ్లి చేసుకున్నారు.
తరచుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తూ ఉండేవట..గత రెండు వారాల నుంచి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు రావడంతో తన భార్య ఏకంగా భర్త దగ్గరికి వెళ్లి నాలుకను కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉండడంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నాలుక రెండు ముక్కలుగా తెగి పడటంతో ఆస్పత్రి సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఇదంతా జరిగిన తర్వాత తన భార్య కూడా (రవీనా) ఇంట్లో గది తలుపులు మూసి వేసుకొని మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఆమెను కూడా రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన తర్వాత కన్హయ్యలాల్ సోదరుడు తన వదినపై కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ లో భాగంగా రవీనా సైన్ (23) పై భారత శిక్షాస్మృతిలోని 115(2), 118(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. గాయపడిన భర్త మాత్రం ఇప్పుడు కాస్త కోరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









