Iftar Recipes: రంజాన్ నెలలో మీ ఇఫ్తార్ మరింత ఆరోగ్యంగా, రుచికరంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన డిషెస్ ఉండాల్సిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం తరువాత సాయంత్రం ఇఫ్తార్ వేళ రుచికరమైన బలవర్ధకమైన ఆహార పదార్ధాలు తీసుకుంటారు. మీ ఇఫ్తార్ మరింత రుచికరంగా ఉండేందుకు అవసరమైన కొన్ని ప్రత్యేక వంటల గురించి తెలుసుకుందాం.
ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ 9వ నెలలో ఉంటుంది. రోజూ సూర్యోదయం కంటే ముందు సహరీ నుంచి సాయంత్రం సూర్యాస్తమయం ఇఫ్తార్ వరకూ కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటవుతుంటాయి. వివిధ రకాల వంటలు అందుబాటులో ఉంటాయి. ఇందులో బిర్యానీ, నిహారీ, షర్బత్, స్వీట్స్ ఇలా చాలా రకాలుంటాయి. మీ కోసం కొన్ని ప్రత్యేకమైన డిషెస్ వివరాలు అందిస్తున్నాం.
షాహీ టుక్డా..ఇదొక టేస్టీ స్వీట్. ఇందులో రోటీ, పాలు, కుంకుమ, బాదం ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
కతాయఫ్..ఇదొక అరబిక్ స్టైల్ స్వీట్. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కొద్దిగా రోస్ట్ చేస్తారు. రంజాన్ నెలలో ముస్లింలు అందరికీ ఇది సుపరిచితం.
షీర్ ఖుర్మా అనేది ముస్లింల ట్రెడిషనల్ స్వీట్. సేమ్యాతో చేస్తారు. రంజాన్ పండుగ ప్రత్యేకం ఇది. సన్నని సేమ్యాలు, ఖర్జూరం, పాలు, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉంటాయి.
ఫిర్నీ..ఇది నార్త్ ఇండియా ప్రత్యేకమైన స్వీట్. బియ్యం తీపి పాలలో వండించి చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. రంజాన్ సమయంలో ఇఫ్తార్ వేళ ఇది చాలా స్పెషల్ డిష్.
Also read: Aadhaar Rule changed: ఆధార్ కార్డులో కీలకమైన మార్పు, ఇకపై ఎవరికైనా అథెంటికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









