Rare Huge White Snake Video: ఎప్పుడైనా 20 అడుగుల రియల్ స్వేత నాగును చూశారా? చూడని వారు ఇప్పుడే చూడండి!

Rare Huge White Snake Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో 20 అడుగుల పెంపుడు పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ తెగ ఆశ్యర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2025, 09:12 AM IST
Rare Huge White Snake Video: ఎప్పుడైనా 20 అడుగుల రియల్ స్వేత నాగును చూశారా? చూడని వారు ఇప్పుడే చూడండి!

Rare Huge White Snake Video Watch: అందరూ ఎన్నో రకాల వింత పాములను చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలే వైరల్‌ అవుతూ ఉంటాయి. నెటిజన్స్‌ ఎక్కువగా వీటిని చూసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని  సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్శించేందుకు స్నేక్‌ క్యాచర్స్‌ కూడా పాములు పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇందులో చాలా వరకు కొన్ని వీడియోలు సోషల్‌లో ట్రెండ్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది నెట్టింట్లో షేర్‌ చేసిన నాగమని, స్వేత నాగులకు సంబంధించిన పాముల వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇటీవలే కూడా ఓ తెలుపు రంగు పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

Add Zee News as a Preferred Source

ఈ వైరల్‌ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ 75 ఏళ్ల వృద్ధురాలు తమ పెంపుడు 20 అడుగుల శ్వేత నాగు మెడకు తాడు కట్టి బయటికీ తీసుకు రావడం గమనించవచ్చు. ఈ అరుదైన పాము వీడియో చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా లభిస్తాయి. అంతేకాకుండా ఆ వృద్ధురాలు కొన్ని ఏళ్లుగా పెంచుకుంటున్నట్లు ఇంకో వీడియోలో వివరించారు. తనకు ఇష్టమైన పెంపుడు జంతువుల్లో ఇది ఒకటని తెలిపారు. ఇదిలా ఉంటే స్వేత నాగును అతి భయంకరమైన పాముల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఇది మనుషులపై దాడి చేస్తే, క్షణాల్లోనే రక్తం కక్కుకుని చనిపోయే ప్రమాదం కూడా ఉందట..
 
ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ స్వేత నాగుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియోను @rosssmith1 అనే ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. దీనికి "funny grandma videos" అనే క్యాప్షన్‌ పెట్టి షేర్‌ చేశారు.  ఇప్పటికీ ఈ పాముకు సంబంధించిన వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక లక్షకు పైగా లైక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 5,299 మందికి పైగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలా కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ పాము చాలా డేంజర్‌ అని.. "ఏ క్షణమైన దాడి చేస్తుందని కొంతమంది నెటిజన్స్‌ అంటే".. మరికొంతమంది "ఇలాంటి తెలుపు రంగు పామును ఎప్పుడూ చూడలేదని" కామెంట్లలో తెలుపుతున్నారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News