Giant Blue King Cobra Video Watch Here: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన పాముల్లో కింగ్ కోబ్రా (ఓఫియోఫాగస్ హన్నా) పాము ఒకటి. ఇది చూడడానికి 13 అంగుళాల పొడవు ఉన్నప్పటికీ యమ డేంజర్.. ఈ జాతి పాములు వివిధ రంగులతో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రకాల పాములైతే నలుపు రంగులో ఉంటే మరికొన్ని రకాల పాములు పసుపు రంగులో కూడా అప్పుడప్పుడు మనం చూడవచ్చు. అయితే కింగ్ కోబ్రా జాతి పాముల్లో బ్లూ కలర్ పాములు కూడా ఉంటాయి. ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి లేత నీలిరంగులో ఉంటాయి. అయితే ఇందులోనే ఎక్కువ వయస్సు కలిగిన పాములు ప్యూర్ నీలిరంగులో కనిపిస్తాయి. ఈ పాములు చాలా ప్రత్యేకమైనవిగా భావించవచ్చు.
సాధారణంగా బ్లూ కలర్ కింగ్ కోబ్రాలు 10 నుంచి 13 అడుగుల పొడవు ఉంటాయి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పాములు దాదాపు 18 అడుగులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి స్పష్టమైన నీలిరంగు తో పాటు మెడ భాగంలో విశాలమైన పడగలను కలిగి ఉంటాయి. తరచుగా ఈ పాములు ఆగ్నేయాసియాలోని విశాలమైన మైదానాలతోపాటు దట్టమైన అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఎక్కువగా వీటిని చూడవచ్చు. ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో జీవించేందుకు ఎక్కువగా ఇష్టపడతాయట.. అంతేకాకుండా గ్రీనరీ గా ఉండే ప్రదేశాల్లో పిల్లలకు జన్మనిచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతాయని సమాచారం. ఆడ కింగ్ కోబ్రాలు పిల్లలకు జన్మనిచ్చేందుకు ప్రత్యేక మైన ఆవాసాలను ఏర్పాటు చేస్తాయి ఆకులు ఇతర పదార్థాలతో ప్రత్యేకమైన పుట్టలను నిర్మించి అందులో పిల్లలు పుట్టే వరకు ఉంటాయని సమాచారం.
ఈ బ్లూ కింగ్ కోబ్రాలను అతి భయంకరమైన పాములుగా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ పాములు ఆహారంగా కేవలం ఇతర పాములను మాత్రమే చంపి తింటూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులోని కొన్ని పాములు తోటి భాగస్వామ్య పాములను కూడా ఎంతో క్రూరంగా చంపుకుని తింటాయట. తాజాగా వీటికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో బ్లూ కలర్ కింగ్ కోబ్రా ఒక పిల్ల పామును మెడ బాగాన పట్టి నమిలి తినడం మీరు గమనించవచ్చు. ఆ పిల్ల పాము ఏ మాత్రం తప్పించుకొని లేని పరిస్థితుల్లో ఉండడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్లూ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను @100M-r అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 2000 మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్ కూడా చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









