Rare Cat Blessing Video Watch Now: తరచుగా సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది షేర్ చేసిన పెంపుడు కుక్కలు, ఇతర జంతువులకు సంబంధించిన వీడియోలు నిమిషాల వ్యవధిలోనే కోట్ల వ్యూస్ అందుకు ఉంటాయి. చాలామందికి పెంపుడు జంతువులపై ఉండే ప్రేమ వర్ణనాతీతం.. అందుకే చాలామంది పెంపుడు జంతువులను తమ పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు ఏవైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యం కూడా చేయిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా పెంపుడు పెళ్లికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ పిల్లి చైనాలో ఉంటే ఓ ప్రత్యేకమైన దేవాలయంలో ఉంటుందట. అంతేకాకుండా దేవాలయానికి వచ్చే భక్తులకు వినూత్నంగా స్వాగతం కూడా పలుకుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ పిల్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో దుమ్ము రేపుతోంది.
పెంపుడు పిల్లలు చాలా అరుదుగా యజమానుల మాటలు వింటు ఉంటాయి. అంతేకాకుండా వారు చెప్పిన పనులను చేస్తూ ఉంటాయి. కానీ చైనాలోని ఓ దేవాలయంలో ఉండే పిల్లి అన్ని పిల్లిల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పిల్లి తెలియని వ్యక్తులకు కూడా అద్భుతంగా ఆకర్షిస్తుంది. చైనాలోని జియువాన్ ఆలయంలో నివసించే పిల్లి రోజు దేవాలయానికి వచ్చి వెళ్లే భక్తులకు ఆశీర్వాదము అందిస్తుందట. కొంతమంది భక్తులు పెళ్లి చేస్తున్న వింత ఘటనను చూసి ఆ ఘటనను మొబైల్లో వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిల్లికి సంబంధించిన వీడియో విపరీతంగా ఇంటర్నెట్లో వైరల్ అవుతూ వస్తోంది.
జియువాన్ ఆలయంలో ఉండే ఈ అరుదైన జాతికి సంబంధించిన పెళ్లి.. ఆలయానికి వచ్చే ప్రతి భక్తునికి ఆశీర్వాదం అందిస్తుందట. అంతేకాకుండా కొంతమంది ఈ పిల్లి అనుగ్రహంతో అదృష్టాన్ని పొందిన వారు కూడా ఉన్నారట. ఇలా పొందిన వారు పిల్లి మెడలు బంగారు గొలుసులను కూడా వేశారని అక్కడి కొంతమంది తెలిపారు.. అంతేకాకుండా పిల్లి అనుగ్రహం పొందిన ప్రతి ఒక్కరు అదృష్టాన్ని పొందుతున్నారని వారు అంటున్నారు. అప్పటినుంచి చాలామంది పిల్లి కోసం అయినా దేవాలయానికి రోజు వస్తున్నారట.. మరి కొంతమంది అయితే పిల్లి అనుగ్రహం కోసం క్యూలు కూడా కడుతున్నారని సమాచారం..
మొదటగా వీడియోలో పెళ్లి కొంతమందికి హై-ఫైవ్ ఇవ్వడం మీరు గమనించవచ్చు.. అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు పెళ్లితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఇలా ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిల్లికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్స్ "ఈ పిల్లి అనుగ్రహం ఇవ్వడం లేదు ఆహారం కోసం ఇలా చేస్తూ ఉందని" అంటున్నారు.. ఏది ఏమైనా ఈ పిల్లికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షలమంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









