)
Venomous Cobra Viral Video Watch: మనకు సోషల్ మీడియాలో నిత్యం సరీసృపాలకు సంబంధించిన అనేక వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వీడియోలే చూస్తూ ఉంటారు. ముఖ్యంగా షార్ట్ వీడియోలైతే ఎక్కువగా జనాలను రీచ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు ట్రెండ్ కూడా అవుతాయి. అయితే, కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు దీనిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన షార్ట్ వీడియోలను పోస్ట్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వారు పాములను పట్టుకుంటున్న సమయంలో చేసే సాహసం గురించి, పాములను వదిలిపెడుతున్న సందర్భాల్లో తీస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పాములకు సంబంధించిన అరుదైన దృశ్యాలు కూడా చిత్రీకరించి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ చేసిన వీడియోనే ఇటీవలే వైరల్‌గా మారింది.
తాజాగా యూట్యూబ్‌లో కేవలం 6 సెకండ్లు కలిగిన ఓ అరుదైన కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో పొలంలో కింగ్ కోబ్రా నిటారుగా నిలబడి.. పడగవిప్పి కనిపిస్తోంది.. ఈ వీడియోలో పాము ఆగ్రహంతో వనికి పోవడం గమనించవచ్చు. అంతేకాకుండా వీడియో తీస్తున్న వారిపై దాడికి దిగడం కూడా మీరు చూడొచ్చు. అయితే పడక విప్పిన సందర్భంలో నాగుపాము అరుదుగా కనిపిస్తుంది. ఆ పడగలో అరుదైన నల్లటి రంగులో వజ్రం కూడా కనిపిస్తుంది. దీనిని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది అరుదైన నాగమణిగా భావిస్తున్నారు.
ఆరు సెకండ్ల నిడివి గల ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ పాము పడగ భాగంలో ఉన్న ఒక అరుదైన కాంతివంతమైన నలుపు రంగులో కూడిన వజ్రాన్ని చూసి ఈ పాము మహాశక్తులు కలిగినదిగా భావిస్తున్నారు. నిజానికి ఇలాంటి అరుదైన పాములు కేవలం కొన్నిచోట్లలో మాత్రమే జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి అరుదైన పాముల వీడియోలు కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.
ఈ వీడియో చూసిన మరి కొంతమంది పాము పడగ భాగంలో ఉంది నాగమణి కాదని ఎవరో కావాలని పెంచుకుంటున్న పాము పడగ భాగంలో నలుపు రంగులో కూడిన రాయిని అతికించారని అంటున్నారు. మీరు కూడా క్లియర్ గా గమనించి ఈ పామును చూస్తే ఎవరు కావాలని పాము కు నల్లని అరుదైన రాయిని అతికించినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను Serpent Shorts అని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోని షేర్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి