)
Black Python Killing A Mongoose Watch Video: పాము ముంగిసకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో అన్ని వీడియోస్‌లో ఎక్కువగా ముంగిస పామును చంపేయడం మీరు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా వాటి రెండిటి మధ్య బీకర యుద్ధాన్ని కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తిలకిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటన్నిటికీ విరుద్ధంగా ఉంది. వీడియోలో అత్యంత ప్రమాదకరమైన నల్లత్రాచు పాము ఏకంగా ముంగిస పైనే దాడి చేసి.. చంపేసింది. అవును మీరు చూస్తున్న ఘటన నిజమైందే. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా నల్లత్రాచు, ముంగిసలు ప్రకృతి సిద్ధంగా ఒకదానికొకటి బద్ధ శత్రువులు.. అలాంటివి రెండు ఎదురెదురు అవుతాయి తప్పకుండా పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే ఇటీవల కూడా ఇదే జరిగింది. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది. ముంగిస పాముకి ఎదురుపడితే తప్పకుండా చంపే దాకా అక్కడ నుంచి వెళ్ళదు. అలాంటిది ఈ వీడియోలో ఏకంగా నల్లత్రాచు పాము ముంగిసనే హతమార్చింది.. ఈ దృశ్యాలు చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువ రైతు పాడి పశువుల కోసం గడ్డి కోయడానికి పొలానికి వెళ్తాడు. అయితే, అక్కడ అత్యంత ప్రమాదకరమైన నల్లత్రాచు పాము అతడికి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఒక ముంగిస కూడా అక్కడ విగత జీవిగా పడి ఉండడం చూస్తాడు. దీంతో ఆ యువరైతు వెంటనే తన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి వీడియో తీస్తాడు. ఈ సమయంలో ఆ పాము అతడి పైకి బుసలు కొట్టడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోలో ముంగిస మరణించినట్లు కూడా మీరు చూడొచ్చు.
సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన పాములను సైతం ముంగిసలు ఎంతో సులభంగా చంపేస్తాయి. అలాంటిది ఈ వీడియోలో నల్లత్రాచుపాము ఏకంగా ముంగిసను చంపేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా చనిపోయిన ముంగిసను మళ్లీ మళ్లీ దాడి చేయడం కూడా ఈ వీడియోలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను రాజు లోకల్ ఫిషర్ బాయ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వీడియోను కొన్ని వందల మంది చూశారు. అంతేకాకుండా కొంతమంది లైక్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి