Rare King Cobra Nagamani Stone Video: కొంతమంది కేటుగాళ్లు అమాయకపు ప్రజలను క్యాష్ గా చేసుకొని వాడుకుంటున్నారు.. మరి కొంతమందికేటుగాళ్లు అయితే వారిలో ఉన్న భయాన్ని గుర్తించి క్యాష్ గా కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ కావలసింది డబ్బే.. దీనిని సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఇటీవలే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం పరిసరాల్లో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. కేశనపర్రు గ్రామ సమీపంలోని ఓ ఇద్దరు యువకులు నాగమణి స్టోన్స్ అని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కేశనపర్రు గ్రామ సమీపంలో పొలాల్లో పనిచేస్తున్న కొంతమంది రైతులను ఇద్దరు యువకులు మోసం చేసే ప్రయత్నం చేశారు. వారు అక్కడున్న రైతులకు పాముల తలను కట్ చేసి పామురాళ్ళు అంటూ అమ్మే ప్రయత్నం చేశారు. ఈ రాళ్లు ఉంగరానికి ధరించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని.. అలాగే ఈ రాయి ఇంట్లో ఉంటే ఇంటి చుట్టూ ప్రదేశంలో ఎలాంటి ప్రాములు తిరగమని.. తేళ్లు జెర్రీలైతే ఇక పరిసరాల్లోకి రావడం మానుకుంటాయని ఆ రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా జిల్లాల్లోని వివిధ గ్రామాలలో పట్టిన పాములను తీసుకువచ్చి వాటి తలలను కట్ చేసి మరి రాళ్లు తీసి వారికి చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా అక్కడున్న ఓ రైతు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Man Removes Nagamani From Cobra Head Watch Video#Nagamani #Snakevideo #Apnews pic.twitter.com/7JOZW2qKlZ
— TodayHoroscope TodayHoroscope (@TTodayhoro30767) March 2, 2025
అలాగే రైతులందరూ చూస్తుండగా ఓ పామును బ్యాగ్ లో నుంచి తీసి దాని తలను కట్ చేసి మరి అందులో నుంచి రెండు రాళ్ళను తీసి చూపించారు. అంతేకాకుండా ఒక్కొక్క రాయిని రూ.500 నుంచి రూ.1500 వందల వరకు విక్రయించారు.. అంతేకాకుండా ఆ ఇద్దరు యువకులు ఈ నాగమణి రత్నాలను అమ్మే క్రమంలో రైతులను బుజ్జగించేందుకు ఒక ఆడపాము తలలో మాత్రమేbనాలుగు రాళ్లు ఉంటాయని, మగ పాములు రెండు రాళ్లు మాత్రమే ఉంటాయని వారందరికీ చెప్పారు.
అంతేకాకుండా విష పురుగులు పాములు కాటేసిన ప్రదేశాల్లో ఈ స్టోన్స్ ని ఉంచడం వల్ల ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా ఉంటారని వారు రైతులను నమ్మించేందుకు ఇలా కట్టు కథలు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా దీనిని నమ్మిన కొంత మంది రైతులు ఎగబడి మరి ఈ రాళ్ళను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపారు.. మరి కొంతమంది అయితే వారు అన్న రేటు కంటే ఎక్కువగానే పెట్టి ఈ రాళ్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









