Mermaid Video: శబరిమలై పంబానదిలో అరుదైర జలకన్య దర్శనం.. ఇదిగో వీడియో ఇదే చూడండి..

Mermaid In Pamba River Video: శబరిమలై పంబానదిలో జలకన్య ఈదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్స్‌ ఇది ఒక AI జనరేట్‌ చేసిన వీడియో అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడే చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 04:37 PM IST
Mermaid Video: శబరిమలై పంబానదిలో అరుదైర జలకన్య దర్శనం.. ఇదిగో వీడియో ఇదే చూడండి..

Mermaid In Pamba River Video Watch Here: శబరిమలై యాత్రలో పంబా నదికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. అందుకే యాత్రకు వెళ్లిన ప్రతి ఒకరు ఈ నదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి భక్తులు ఈ నదిని కేవలం ఒక నీటి ప్రవాహంలా చూడకుండా..పవిత్రమైన తీర్థ స్థలంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ పంబా నదిని దక్షిణ భాగీరథి అని కూడా పిలుస్తారు. అలాగే ఈ నది కేరళ రాష్ట్రంలో పెరియార్ నది తర్వాత రెండవ అతిపెద్ద నదిగా చెప్పుకుంటారు. ఈ నది మొదటగా పశ్చిమ కనుమలలో ప్రారంభమై.. పత్తనమిట్ట, చెంగన్నూరు, కుట్టనాడ్, అంబలపూజతో పాటు అయైరూర్ ప్రాంతాల గుండా కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది.

Add Zee News as a Preferred Source

అయ్యప్ప భక్తులంతా స్వామిని దర్శించుకోవడానికి ముందు ఈ నదిలో స్నానం చేయడం పూర్వీకుల నుంచి వస్తున్న ఓ ఆనవాయితీ. ఈ నదిలో స్నానం చేస్తే తరతరాల నుంచి వస్తున్న పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం.. అంతేకాకుండా రామాయణంలో కూడా పంబా నది కూడా ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది. శ్రీరాముడు వనవాస చేసిన సమయంలో పంబా నదీ మీదుగానే శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు తెలిపారు. అలాగే ఇక్కడ పితృకర్మలు నిర్వహించేవారికి ఏడు తరాల వారు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం..

చాలా మంది శబరిమలై కాలినడకన వెళ్లే భక్తులు ముందుగా చాలక్కాయం మీదుగా  పంబా నది వెళ్తారు. అలాగే శబరి కొండకు, ఈ నదికి దాదాపు ఏడు కీలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ స్థానం చేసిన భక్తులు నేరుగా నీలిమలై కొండ మీదుగా శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా పంబా నది తీరానా తొలిసారిగా కన్నెస్వాములు అయిన భక్తులు ఇక్కడ వారి వెంట తెచ్చిన బాణాన్ని ఇక్కడే ఉంచుతారు. ఇక్కడే ఉంచడం వల్ల దీక్షకు ఫలితం లభిస్తుందని స్వాముల నమ్మకం. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నదిలో ఇటీవలే కొన్ని అరుదైన దృశ్యాలు కనిపించాయి. 

ఇటీవలే పంబా నదిలో ఓ అరుదైన జలకన్య దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ప్రవహిస్తున్న జలంలో జలకన్య ఈదుతూ వెళ్లడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన రీల్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. దీనిని @arjun_astrolgy అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు దీనిని చూసిన చాలా మంది ఇది నిజం అనుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది AI జనరేట్‌ చేసిన వీడియో అని అభిప్రాయపడుతున్నారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News