Giant Red Spitting Cobra Video: గాల్లో విషాన్ని చిమ్మె అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..

Giant Red Spitting Cobra Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో విషాన్ని చిమ్మె రెడ్ కింగ్ కోబ్రా కు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. పాములు ఇలా విషాన్ని కూడా చిమ్ముతాయాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 08:36 AM IST
Giant Red Spitting Cobra Video: గాల్లో విషాన్ని చిమ్మె అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..

Giant Red Spitting Cobra Video Watch Here​: విషయాన్ని చిమ్మే పాములు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి అన్ని పాముల కంటే చాలా ప్రత్యేకమైన విగా చెప్పవచ్చు. ఆహారాన్ని వేటాడడానికి ముందుగా తమను తాము రక్షించుకునేందుకు ముందున్న జంతువుల కళ్ళలోకి విషయాన్ని చిమ్మి వేటాడుతాయి. ఆ తర్వాత ఈ పాములు నేరుగా వాటి దగ్గరికి వెళ్లి వాటి పళ్ళతో మరోసారి విషయాన్ని ఎక్కిస్తాయి. వీటి విషయంలో న్యూరోటాక్సిక్ అనే రసాయనాలు ఉంటాయి కాబట్టి ఇది నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మరణించేలా చేస్తుందని కొంతమంది  నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విషయాన్ని చిమ్మే పాముల పట్ల తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

కొన్ని పాములు మాత్రమే తమ శరీరంలో ఉండే విషాన్ని బయటకు చిమ్మగలుగుతాయి. అందులో భారతదేశానికి చెందిన కొన్ని కోబ్రాహారలకు సంబంధించిన జాతులు కూడా ఉన్నాయి.  అలాగే ఓ జాతికి చెందిన క్రైట్ (Krait) అనే పాము కూడా విషయాన్ని చిమ్ముతుందట. ఈ పాము విషం అత్యంత శక్తివంతమైందని.. ఒక్క కాటుతోనే మరణించే సామర్థ్యం కలిగి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని భారతదేశంలో కట్లపాముగా పిలుస్తూ ఉంటారు.  ఈ కట్లపాము న్యూరోటాక్సిక్ విషం అన్ని పాముల్లో ఉండే విషయం కంటే చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఏ జంతువుపై లేదా మనిషిపై దాడి చేసిన నిమిషాల వ్యవధిలోనే రక్తం కక్కుకొని మరణించే అవకాశాలు ఉన్నాయి. 

విషాన్ని బయటికి చిమ్మె పాముల శరీరం అన్ని పాములు శరీరం కంటే కాస్త విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఎంతో శక్తివంతమైన కండరాలను కూడా కలిగి ఉంటాయి. తాజాగా విషాన్ని చిమ్మె పాము కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ అరుదైన రెడ్ కింగ్ కోబ్రా జంతువుల పై దాడి చేసేందుకు తన లోపలి శరీరంలో ఉన్న విషాన్ని బయటికి చిమ్మడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా జంతువులను భయపెట్టేందుకు బుసలు కొడుతూ ఉండడం కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.. పాములు ఇలా కూడా ఉంటాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెడ్ కింగ్ కోబ్రా కి సంబంధించిన వీడియోను @theworldtour123 అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని వేలమంది దీనిని లైక్ చేశారు. అలాగే కామెంట్లు కూడా చేస్తున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News