
Giant Rattle Snake Video Watch Now: సాధారణంగా పాములంటేనే చాలామంది పరుగులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది అయితే వాటిని చూసేందుకు కూడా ఇష్టపడరు. ఇక అవి ఏదో పొరపాటున దగ్గర నుంచి వెళితే ఇక అంతే సంగతులు. పాములు అతి విషపూరితమైనవి కాబట్టి చాలామంది వాటితో సాహసాలు చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపరు. అంతేకాకుండా వాటికి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే కొన్ని ఊళ్ళలోకి తరచుగా పాములు సంచారం చేస్తూ ఉంటాయి. ఇవి నేరుగా ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తూ ఉంటాయి. ఇళ్లలో చొరబడిన వెంటనే వీటిని చూసి చాలామంది స్నేక్ క్యాచెస్ కి సమాచారం అందిస్తున్నారు తద్వారా వారు వాటిని పట్టుకొని అడవుల్లోని దూర ప్రదేశాల్లో వదిలిపెడుతున్నారు. వీటిని సాధారణ జనాలైతే పట్టుకోవడం ఎంతో కష్టం. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అందరి ఊహలకందని సాహసం చేశాడు.
తాజాగా ఓ వ్యక్తి తన చేతులతో ఏకంగా కొన్ని పాములను పట్టుకొని చుట్టూ అటూ ఇటూ తిప్పాడు. అంతేకాకుండా తనకు నచ్చినట్లుగా ఆటాడుకుంటూ కనిపించాడు. సాధారణంగా ఒక్క పాముని పట్టుకునేందుకే స్నేక్ క్యాచర్స్ ఎంతో సాహసం చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి ఏకంగా ఆరు ఏడు పాములను అవలీలగా ఒక్కటే చేతిలో పట్టుకొని అటు ఇటు తిప్పడం చూస్తే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అంతేకాకుండా ఆ యువకుడు పాములను పట్టుకొని దాదాపు ఒక రెండు నిమిషాల పాటు అలాగే చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలు జరిగిన తేదీ, వీడియోకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించక పోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మామూలుగా వైరల్ అవ్వడం లేదు.. ముఖ్యంగా ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ తన ఖాతా నుంచి రాటిల్ స్నేక్ అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశాడు. అయితే ఈ వీడియోను కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇతర మాధ్యమాలలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. దీనిని చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు కొందరైతే జంతువు పట్ల హింస చేసిన వారిని తప్పకుండా శిక్షించాలని కామెంట్లలో తెలుపుతున్నారు ఏది ఏమైనా ఇలా పాములను పట్టుకొని తిప్పడం సరికాదని మరికొంతమంది అంటున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి