Lovers Romance Video: ఆర్సీబీ గెలిస్తేనే ముద్దులు.. రోడ్డుపైన కంట్రోల్ చేసుకోలేక రెచ్చిపోయిన ప్రియుడు.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో..

rcb won ipl 2025 lover kiss video: దాదాపు పద్దేనిమిదేళ్ల తర్వాత ఆర్సీబీ  బెంగళూరులో భారీ విజయంను సొంతం చేసుకుంది.ఈ క్రమంలో రోడ్డు మీద లవర్స్ జంట చేసిన అరాచకం ప్రస్తుతం వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 4, 2025, 02:26 PM IST
  • రోడ్డుపైన రొమాన్స్ కు దిగిన లవర్స్..
  • ఆర్సీబీ అభిమానుల సంబరాలు..
Lovers Romance Video: ఆర్సీబీ గెలిస్తేనే ముద్దులు..  రోడ్డుపైన కంట్రోల్ చేసుకోలేక రెచ్చిపోయిన ప్రియుడు.. నెట్టింట  దుమ్మురేపుతున్న వీడియో..

Rcb wins ipl 2025 lovers romance on road video viral: గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో..  పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఆర్సీబీ మట్టి మరిపించింది.  దాదాపుగా.. పద్దెనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫిని తన ఖాతాలో వేసుకుంది.  

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. బైక్ ల   మీద అరుపులు, కేకలు పెడుతు రెచ్చిపోయారు.  మరికొందరు కలర్స్ పేపర్లను చింపుకుంటూ పడేశారు.  పెద్దపెద్దగా అరుస్తు, టపాకాయాల్ని నడి రోడ్డు మీద, ఇళ్లముందే పేలుస్తు సంబరాలు చేసుకున్నారు. కొంత మంది డీజే ర్యాలీలు కూడా తీశారు. అయితే.. ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

 

దీనిలో ఆర్సీబీ గెలిస్తేనే.. ముద్దు, హగ్ లకు ప్రియురాలు  ఓకె చెప్పిందంట. దీంతో అతను ఆర్సీబీ గెలవగానే.. రోడ్డుపైనే రెచ్చిపోయాడు. ప్రియురాలు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను లేట్ చేయోద్దని కూడా తగ్గెదేలా అన్న విధంగా రెచ్చిపోయాడు. మరీ ఆ యువతి ఆర్సీబీ ఎలాగైన గెలవదని ఫిక్స్ అయి.. ముద్దు, హగ్ ఇస్తానని మాటవరసకు చెప్పిందో ఏంటో కానీ.. అతను మాత్రం ఆర్సీబీ గెలవగానే తన పంట పండిందని కూడా ముద్దులతో, హాగ్ లతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశారు.  

Read more: Viral Video: ఏం ఫీల్ ఉంది మామ..!.. రన్నింగ్ బస్సులో మహిళల ఫైటింగ్.. జుట్లు పట్టుకుని మరీ.. వీడియో వైరల్..

అయితే.. చుట్టుపక్కల ఉన్న వారు కొంత మంది ఈ ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పండగా చేసుకుంటాడ్ కదా.. భయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News