Giant King Cobra Video Viral: ప్రస్తుతం ఉన్న కాలంలో స్నేక్ క్యాచర్స్ పల్లె ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికున్న అద్భుతమైన నైపుణ్యంతో పాములను రక్షించేందుకు, ప్రకృతిని కాపాడేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద పాములను కూడా సురక్షితంగా పట్టుకుని, వాటిని మానవ నివాసాల నుంచి దూరంగా అటవీ ప్రాంతాల్లో, చిత్తడి ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. ఇలా పట్టుకునే క్రమంలో చాలా మంది పాము కాటు బారిన కూడా పడుతున్నారు. అయినప్పటికీ వృత్తి ధర్మాన్ని వదులుకోలేక పాములు పట్టుకునే పనే చేస్తున్నారు.
నేటి కాలంలో పల్లెలను పట్టణాలు, నగరాలుగా విస్తరిస్తున్నందున.. ఆడవులు భూభాగాలు పూర్తిగా తగ్గుతూ వస్తున్నాయి. దీని కారణంగా వన్యప్రాణుల అడవుల నుంచి ఆహారం కోసం ఊళ్లలోకి సంచారం చేస్తున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పాములు పొరపాటున ఇళ్లలోకి, కార్యాలయాల్లోకి, ఇతర మానవ నివాసాల్లోకి రావడం సాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో స్నేక్ క్యాచర్ల సేవలు ఎంతో అవసరమవుతున్నాయి. సాధారణ ప్రజలు పాములను పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రమాదకరం.. కాబట్టి స్నేక్ క్యాచర్స్ ఇలా సంచారం చేసే పాములను పట్టుకుంటున్నారు.
చాలా మంది స్నేక్ క్యాచర్లు విషపూరితమైన పాము కాటు బారిన పడకుండా ఉండడానికి.. సాధారణ పరికరాలలో పాము కర్ర (స్నేక్ హుక్), పామును పట్టుకునే సంచి లేదా పెట్టె, కొన్నిసార్లు రక్షణ తొడుగులు కూడా వినియోగిస్తున్నారు. చాలా మంది పాములు పట్టుకునేందుకు అనేక జాగ్రత్తలు పడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది స్నేక్ క్యాచర్స్ కొత్తగా ఆలోచించి.. పాములు పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి కోవాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ పట్టుకున్న పెద్ద పామును సంచిలో తీసుకుని ఓ పిల్ల కాలువ ఒడ్డున ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఆ స్నేక్ క్యాచర్ పట్టుకున్న భారీ కింగ్ కోబ్రాను సంచి ముడి తీసి బయటకు వదిలి పెట్టాడు. సంచి ముడి తీసిన వెంటనే పాము కూడా వెంటనే అందులో నుంచి నీటికి పాకుతూ బయటికి వెళ్లడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @WildVenka అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 17 వేల మంది సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్ కూడా చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









