Baby Snake Video: గుడ్డులో నుంచి అరుదైన పాము పిల్లను తీసిన పరిశోధకుడు.. ఇలాంటి వీడియో జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు..

Rare Baby Snake Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పరిశోధన శాలలో పరిశోధకుడు గుడ్డులో నుంచి పాము పిల్లలను తీస్తున్న దృశ్యాలను పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 1, 2025, 01:30 PM IST
Baby Snake Video: గుడ్డులో నుంచి అరుదైన పాము పిల్లను తీసిన పరిశోధకుడు.. ఇలాంటి వీడియో జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు..

 Rare Baby Snake Viral Video Watch Now: ప్రపంచంలో వివిధ రకాల జాతులకు సంబంధించిన పాములు ఉన్నాయి. ఒక్కొక్క పాము ఒక్కొక్క రూపు రేఖను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్క పాము ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది.. అయితే పునరుత్పత్తి కూడా జాతులను బట్టి ఉంటుంది. కొన్ని జాతులకు సంబంధించిన పాములు నేరుగా పిల్లలకు జన్మనిస్తే మరికొన్ని జాతులకు సంబంధించిన పాములు గుడ్ల ద్వారా పిల్లలను కంటూ ఉంటాయి. గుడ్ల ద్వారా పొదిగి పిల్లల అందించి పాములను  "ఓవిపారస్" స్నేక్స్ గా పిలుస్తారు. ఇవి గుడ్లు పెట్టి కొన్ని రోజుల తర్వాత పిల్లలను కానీ వాటికి రక్షణగా నిలుస్తాయి.

Add Zee News as a Preferred Source

సాధారణంగా గుడ్లు పెట్టే పాముల్లో ఆడ పాము సంభోగం తర్వాతనే శరీరంలోని పొట్ట భాగంలో గుడ్డు అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటిగుడ్లపై భాగం చాలా గట్టిగా ఉండటమే కాకుండా ప్రత్యేకమైన తోలును కలిగి ఉంటుంది. అంతేకాకుండా పాములు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేకమైన ఆవాసాలను ఏర్పరచుకుంటాయట. ఇందులో భాగంగానే పాములు రాళ్ల పగుళ్ల మధ్యల, చెట్ల పొదల్లో, కుళ్లిపోయిన చెట్లను వాటి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయట. 

 
 
 
 
 

ఒక్కొక్క జాతికి చెందిన పాము ఒక్కొక్క గుడ్డు పరిమాణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని పాముల జాతులకు సంబంధించిన గుడ్లు ఎంత పెద్దగానో ఉంటాయి. మరికొన్ని పాముల జాతికి సంబంధించిన గుడ్లు, చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా పాము గుడ్డుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పెద్ద గుడ్డులో నుంచి అరుదైన పామును తీయడం మీరు గమనించవచ్చు.

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ పరిశోధన శాలలో పరిశోధకుడు పాము గుడ్లను కట్ చేసి అందులో నుంచి పిల్లలను తీస్తున్న అరుదైన దృశ్యాలు మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఆ పాము వెంటనే బయటికి వచ్చి కెమెరా వైపు చూడడం కూడా మీరు గమనించవచ్చు. ఆ పరిశోధకుడు దాదాపు 10 గుడ్ల నుంచి పిల్లలను తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ కథ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను చాలామంది సోషల్ మీడియా వినియోగదారులను వీక్షించారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News