Rooster playing football video: చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులు, ఏనుగులను ఎంతో ఇష్టపడుతుంటారు. కొంత మంది నోరుఉన్న మనుషుల కన్నా.. నోరులేనీ జీవాల్ని ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. చాలా మంది ఇటీవల కాలంలో ఎంతో మంది అనేక ఒత్తిడుల బారిన పడి తెగ ఇబ్బందులు పడిపోతున్నారు. ఇంట్లో మూగజీవాలు ఉంటే.. చాలా వరకు ఒత్తిడి వంటివి దూరమౌతుందని కూడా చెబుతున్నారు. అందుకే కొంత మంది వైద్యులు ఇంట్లో పెంచుకొవాలని చెబుతుంటారు. అవి చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి.
ఇలాంటి క్రమంలో ఆ జంతువుల ప్రవర్తనలో చూస్తే మనసులో ఉన్న ఒత్తిడి దూరమౌతుందని చెబుతారు. అయితే.. ఇటీవల కుక్కలు, పిల్లులు, ఏనుగుల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు సైతం.. జంతువుల ఫన్నీ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
AI will never be able to create a scene like this. pic.twitter.com/DizLn9eBAj
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 31, 2025
కొంత మంది తమ పెంపుడు జంతువులకు ట్రైనింగ్ లు కూడా ఇస్తుంటారు. బైట ఉన్న పేపర్ ఇంట్లోకి తీసుకుని రావడం, వస్తువులు అడిగితే తీసుకొచ్చి ఇవ్వడం, ఎవరైన కొత్త వాళ్లు వస్తే .. ఎలా ప్రవర్తించాలో ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు.
ఈ క్రమంలో జంతువులు ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక కోడి పుంజు ఫుట్ బాల్ ఆడుకుంటూ ఫన్నీగా ప్రవర్తించింది. అది అచ్చం మనుషుల్లానే.. ఫుట్ బాల్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ.. దాని మీద నిలబడి మరీ ఆడుకుంది. ఫుట్ బాల్ మీద నిలబడి.. ముందుకు వెనక్కు.. బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఆడుకుంటూ రచ్చ చేసింది.
మొత్తంగా కోడి పుంజుకు.. దాని ఓనర్ భలే ట్రైనింగ్ ఇచ్చినట్లున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వావ్ భలే.. ఫుట్ బాల్ ఆడుతుందీగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









