Rottweiler Dog Vs King Cobra: ప్రస్తుతం చాలామంది పెంపుడు కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటున్నారు. ఇవి మనుషులపై చూపించే ప్రేమ అంతో ఇంతో కాదు చాలామంది పెంపుడు కుక్కల ద్వారా కూడా కొంతైనా మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. అందుకే ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే ఇద్దరు తప్పకుండా పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే పెంపుడు కుక్కలు సాధారణంగా తెలియని వ్యక్తులపై, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించే వారిపై దాడి చేస్తూ ఉంటాయి. కొన్ని కుక్కలు మనుషులపై దాడి చేసి ప్రాణాలు కూడా తీస్తాయి. తాజాగా ఓ కుక్క కూడా అదే పనిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఇంతకీ కుక్క ఏం చేసిందో? వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగానే అయితే మనుషులు పాములను చూసి ఎంతో దూరం పరిగెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లోకి ప్రవేశిస్తే స్నేక్ క్యాచర్స్ ఇన్ఫర్మేషన్ అందించి వాటిని పట్టుకునేదాకా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని అటు ఇటు చూస్తారు. కానీ పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే తప్పకుండా వాటిని పట్టుకొని.. దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. ఇటీవల రోట్‌వీలర్ కుక్కకు కూడా అదే పని చేసింది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ పాము ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే దీనిని గమనించిన పెంపుడు కుక్క దానిని అలాగే చూస్తూ మొరుగుతూ ఉంటుంది. పాము కుక్కపై బుసలు కొడుతూ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే కుక్క మాత్రం ఎలాంటి భయం లేకుండా పాము పై దాడికి దిగుతుంది.. ఇలా కొద్దిసేపు రెండు ఫైట్ చేసుకొని చివరికి పాము కుక్క చేతిలో ఊడిపోతుంది. ఆ కుక్క పామును రెండు ముక్కలుగా చీల్చి నోటితో తలభాగాన్ని పట్టుకొని ఉంటుంది.
ఇలాంటి సాహసోపేతమైన పనులు ఇతర పెంపుడు కుక్కలు చేయలేవని.. ఇది ప్రమాదకరమైన జాతికి సంబంధించిన రోట్‌వీలర్ కుక్క కావడంతో చేసిందని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే పామును రెండు ముక్కలుగా చీల్చే సమయంలో ఆ కుక్క యజమాని "హిట్లర్, హిట్లర్, వదిలేయ్యు" అని కేకలు కూడా వేస్తాడు. కుక్క ఏమాత్రం భయపడకుండా దానిపై దాడి చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. దీనిని శ్యామ్ రాడ్నస్ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









