Hotel Attack: హోటల్‌లో మళ్లీ రౌడీ మూక బీభత్సం.. తింటున్న వారిపై విచక్షణారహితంగా దాడి
Pista House Attack: హోటళ్లలో తరచూ తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో చోట రౌడీ మూక రెచ్చిపోయింది. వినియోగదారులపై దాడి చేశారు. ఈ ఘటనతో హోటల్ సిబ్బంది, వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు.
wdy Sheeters Attack: హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. మూకుమ్మడి వచ్చిన రౌడీలు హోటల్‌లో భోజనం చేస్తున్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తింటున్న వారిపై కుర్చీలు ఎత్తేశారు. పిడిగుద్దులు గుద్దుతూ బీభత్సం సృష్టించారు. ఏదో ఒక విషయంలో హోటల్‌లో వచ్చి ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో హోటల్‌లో భయానక వాతావరణం ఏర్పడింది. మిగతా ప్రజలు హోటల్ నుంచి బయటకు వచ్చారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Coins In Chicken Curry: చికెన్ కర్రీతోపాటు 'రూపాయి బిల్లలు' ఎక్స్‌ట్రా.. ఆహారంలో కనిపించిన నాణేలు
హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పర్‌పల్లి చౌరస్తాలో పిస్తా హౌస్ హోటల్ ఉంది. హోటల్‌లోని మండీలో శనివారం రాత్రి అందరూ తింటుండగా అకస్మాత్తుగా కొందరు గ్యాంగ్‌తో లోపలికి దూసుకొచ్చారు. పెద్ద ఎత్తున అరుస్తూ బీభత్సం సృష్టించారు. ఈ సమయంలో కింద కూర్చుని తింటున్న కొందరిపై దాడికి పాల్పడ్డారు. కనిపించిన వస్తువులను వారిపై విసిరి కొట్టారు. ఇంకా పార్కింగ్ వద్ద హంగామా సృష్టించారు. పార్కింగ్ చేసిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అడ్డుకుంటున్న హోటల్ సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
Also Read: Mother Call Saved: కనిపించే దైవం అమ్మ ఇదిగో సాక్ష్యం.. తల్లి 'ఫోన్'తో కుమారుడికి పునర్జన్మ
ఏం జరిగిందో తెలియదు కానీ దాదాపు 17 మందికి పైగా యువకులు హోటల్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేశారు. వెంటనే హోటల్ నిర్వాహకులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ మేనేజర్ మతిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కారణాలు తెలుసుకుంటున్నారు. అయితే హోటల్ నిర్వాహకుల తప్పిదంతోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నారని.. అర్ధరాత్రి వరకు ఆహారం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పిస్తా హౌస్‌లో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇదే హోటల్‌లో భోజనం చేస్తుండగా చికెన్ కర్రీలో నాణేలు కనిపించాయి. ఈ వార్త అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి