Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..

Russell Viper Video Watch Now: అత్యంత ప్రమాదకరమైన రస్సెల్స్ వైపర్ (Russell's Viper) పామును ఓ యువకుడు బూటిలో నుంచి బయటికి తీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ప్రమాదకరమైన పామును పట్టుకొని బయటికి లాగడం మీరు చూడొచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 11, 2025, 02:49 PM IST
Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..

Russell Viper Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ షాట్ వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన పాములకు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే కోట్లలో వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలతో పాటు రస్సెల్స్ వైపర్ (Russell's Viper) పాముల వీడియోలు జనాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీని కారణంగా పాములకు సంబంధించిన ఎలాంటి వీడియోలు పోస్ట్ చేసిన విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా రస్సెల్స్ వైపర్ పాము కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

అత్యంత ప్రమాదకరమైన పాముల్లో రస్సెల్స్ వైపర్ ఒకటి. దీనిని చూడగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. ఈ పాములు ఎక్కువగా అడవి ప్రాంతాలతో పాటు చిత్తడి నేలల్లో జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాములు చాలా అరుదుగా ఒక చోటు నుంచి మరొక చోటికి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా అడవుల్లో వనరుల కోరత ఏర్పడడంతో.. విపరీతంగా జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ పాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 

ముఖ్యంగా కొన్ని పాములైతే ఇళ్లలోకి సంచారం చేసి షూస్‌తో పాటు ఇతర వస్తువుల్లో దూరిపోతున్నాయి. చాలామంది తెలియక వాటిని వేసుకున్న వారికి సమస్య తప్పడం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా దీనికి సంబంధించిందే. ఈ వీడియోను అత్యంత ప్రమాదకరమైన వైపర్ స్నేక్ ఓ ఇంట్లోని షూలో దూరింది. అయితే, ఆ ఇంటి యజమాని దేనిని ముందుగానే గమనించి స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. అతను వెంటనే అక్కడికి చేరుకొని రిస్క్యూ ఆపరేషన్ చేశారు..

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

ముందుగా ఆ యువకుడు పామున బూటుని అలాగే పట్టుకుని.. సురక్షితమైన అడవి ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ షూ లో ఉన్న పాముని ఓ స్నేక్ స్టిక్‌తో బయటకు తీశారు. బయటికి తీసి నెమ్మదిగా ఆ పాముని అక్కడే వదిలేసారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే బీభత్సంగా వైరల్ అవుతుంది. బూటులో రస్సెల్స్ వైపర్ (Russell's Viper) పాము  ఉండడం చూసి కొంతమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి కొంతమంది అడవి ప్రాంతానికి దగ్గరగా జీవించేవారు తప్పకుండా ఇలాంటి వస్తువులు బయటపెట్టే క్రమంలో ఒకటికి రెండుసార్లు చూసి ధరించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News