Viral Video Today: కల్లు తాగే వారు తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

Snake In Kallu Bottle Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్లు సీసాలోని కట్లపాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఏలేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 3, 2025, 09:57 AM IST
Viral Video Today: కల్లు తాగే వారు తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

Snake In Kallu Bottle Video Watch Here: ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతోంది.. పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆరోగ్యానికి శక్తినిచ్చే ఆహారాల నుంచి మద్యపానం వరకు అన్నీ కల్తీ చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి బోనస్ గా నాణ్యతలేని పదార్థాలను వినియోగించి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా తయారీ ప్రదేశాల్లో పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారు.. ఇటీవల కాలంలో బీర్ బాటిల్లలో బొద్దింకలు మొదలుకొని కప్పలు, బల్లులు వచ్చిన సంగతి తెలిసిందే.. గతంలో కొన్ని బీర్ బాటిల్స్ లో బ్లేడ్స్ వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో గతంలో విపరీతంగా వైరాలయ్యాయి. కొంతమంది చేసే నిర్లక్ష్యం వల్లే ఇప్పటికీ చాలామంది ప్రజలు మరణిస్తున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Add Zee News as a Preferred Source

తాజాగా నాగర్ కర్నూలు జిల్లా లట్టుపల్లి గ్రామంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.. ఇదే గ్రామంలో ఒక కల్లు దుకాణం ఉంది. అయితే ఓ యువకుడు ఆ దుకాణానికి వెళ్లగానే అతడు ఒక్కసారిగా షాప్ తిన్నాడు.. అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనను మొత్తం స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలాడు.. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే కోట్ల మందిని రీచ్ అయింది.. ఈ వీడియో వదిలి చాలా రోజులైనప్పటికీ ఇప్పటికీ వైరల్ అవుతూనే వస్తోంది.. ఇంతకీ ఈ వీడియో ఏంటి ఇంతలా వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

కల్లు దుకాణానికి వెళ్లిన యువకుడు అక్కడే ఓ సీసాను కొనుగోలు చేశాడు.. అయితే ఆ సీసాకు సంబంధించిన నూతన తీసి తాగేందుకు కూడా ప్రయత్నించాడు. ఇంతలోనే అతడు ఆ సీసాలో ఏదో ఉన్నట్లు ముందుగానే గుర్తించాడు. వెంటనే నోటి దగ్గర దాకా వెళ్ళిన సీసా ను కిందికి దింపి, దానిని పరీక్ష బట్టి చూశాడు. బాటిల్ లో ఏదో ఉందని అందులోకి మరీ తొంగి తొంగి చూశాడు.. అయితే ఇంతలోనే అతడికి ఓ చిన్న కట్లపాము పిల్ల కనిపించింది. పాము ఉందని గమనించిన ఆ యువకుడు వెంటనే యజమాని దగ్గరికి పరుగులు పెట్టాడు. అంతేకాదండోయ్ ఆ యజమాని ఎంతో రుబాబు చేస్తూ అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యంగానే సమాధానమిచ్చాడు..

దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెంటనే గ్రామంలో ఉన్న కొంతమంది యువకులకు సమాచారం అందించాడు. దీంతో వారంతా ఏకమై కల్లు దుకాణానికి చేరుకున్నారు.. ఆ యజమాని మళ్లీ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో వారంతా కలిసి కల్లు దుకాణంలో ఉన్న సరుకులు మొత్తం ధ్వంసం చేసేసారు.. ప్రస్తుతం పాముపిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే దీనిని పోలీసులు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారు పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. ఆ గ్రామంలోని యువతను బుజ్జగించే ప్రయత్నం చేశారు..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News