)
Cobra vs Scorpion Video Watch Now: సాధారణంగా పాములంటేనే అందరూ ఎంతో భయపడి పోతూ ఉంటారు. పెద్ద పెద్ద జంతువులు సైతం విష సర్పాల ముందు తలవంచుకొని వాటి దారి వెంట అవి వెళుతూ ఉంటాయి. అలాంటిది కేవలం అరంగులం పొడవున్న ఒక చిన్న తేలు.. అత్యంత విషపూరితమైన పాము పిల్లపై దాడి చేసింది.. ఈ ఘటనకు సంబంధించిన ఎనిమిది సెకండ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో చూసిన చాలామంది ఇదేంటి ఇంత చిన్న తేలు పిల్ల ఏకంగా ప్రమాదకరమైన నాగుపాము పైనే దాడి చేస్తూ ఉందని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా పాములతో పాటు పేర్లు కూడా అత్యంత విషపూరితమైనదని చెబుతూ ఉంటారు. నిజానికి తేలు కంటే పాము మరింతో విషపూరితమైంది. అలాంటిది విషపూరితమైన పాముపై తేలు దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక చిన్న పాము పిల్లకు అదురుతూ కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఒక తేలు కూడా ప్రత్యక్షమవడం మీరు చూడొచ్చు. ఆ తేలు పాము పిల్ల శరీర భాగాన్ని పట్టుకొని దానికున్న విషపు కొండితో కాటేయడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో పాము పిల్ల కూడా బాధకు గురవుతూ కనిపించడం మీరు చూడొచ్చు.
ఈ వైరల్ అవుతున్న వీడియోను 'Shmarika World' అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు.. అయితే, పాము ఎంత పెరిగి దాడి చేస్తున్నప్పటికీ.. పేరు మాత్రం వదలకుండా అలాగే పట్టుకొని ఉంది. అంతేకాకుండా దాని విషం కలిగిన కొండిని, అలాగే పాము శరీర భాగంలో దింపి ఉంచింది.. అయితే, తేలు ధైర్యాన్ని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు నివ్వెర పోతున్నారు. చూడడానికి ఎంతో చిన్నగా ఉన్నప్పటికీ అత్యంత ప్రమాదకరమైన పాము పై దాడి చేసి గాయపరిచిందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలను చాలామంది జనాలు చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతారు. ఇందులో భాగంగానే ఇవి అతి తొందరగానే వైరల్ అవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి