Video Viral: షాకింగ్.. గాల్లో ఎగిరి సెక్యురిటీ గార్డును కొరికిన వీధి శునకం.. వీడియో వైరల్..

Stray dog attack on security guard in Mumbai: ముంబైలో సెక్యురీటీగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిపై వీధిశునకం ఒక్కసారిగా దాడి చేసింది.ఈ భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ భయపడిపోతున్నారు.  మరీ ఇంత ఘోరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 13, 2025, 06:42 PM IST
  • ముంబైలో భయానక ఘటన..
  • గార్డుపై వీధికుక్క దాడి..
Video Viral: షాకింగ్.. గాల్లో ఎగిరి సెక్యురిటీ గార్డును కొరికిన వీధి శునకం.. వీడియో  వైరల్..

Security guard injured in stray dog attack in Mumbai: ఇటీవల కాలంలో వీధికుక్కలు దాడులు మరీ ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు చిన్నా, పెద్ద తేడాలేకుండా ఎవరు కన్పిస్తే వారిపై దాడులు చేస్తున్నాయి. వీధికుక్కల వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై కొంత మంది వీధికుక్కలపట్ల తమ సానుభూతిని చూపిస్తున్నారు. కానీ మరికొంత మంది మాత్రం వాటి ప్రాణాల కన్నా మనుషులు ప్రాణాలు ముఖ్యంకాదా అంటూ కౌంటర్ లు వేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

 

మొత్తంగా వీధికుక్కల వివాదంకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. మరోవైపు వీధికుక్కల దాడుల ఘటనలు మాత్రం ఆగడంలేదు. దాని కంట పడితే ఎవర్ని కూడా వదలడంలేదు. పిక్కల నుంచి భూజాలు,  చెంపలు మొదలైన వాటిని కొరికి పడేస్తున్నాయి. ఈ క్రమంలో ముంబైలో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.

ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని ఆదర్శ్ విద్యాలయంలో ఒక వీధి కుక్క రెచ్చిపోయింది. స్కూల్ దగ్గర విధుల్లో ఉన్న సెక్యురిటీ సిబ్బంది పక్కన రెండు వీధికుక్కలు ఉన్నాయి.అప్పటి వరకు బాగానే ఉన్న శునకం ఏమైందో కానీ ఒక్కసారిగా గాల్లో ఎగిరి ఒక గార్డు భుజంను కొరికి పట్టుకుంది. అతను ఎంతగా విడ్పించుకుందామని చూసిన కూడా అది వదల్లేదు.

చివరకు ఎలాగో అతను విడ్పించుకున్నాడు. అదే కుక్క అటు ఇటు వెళ్లి మరోసారి అతనిపైన దాడికి యత్నించింది. అప్పటికే మరో గార్డు పెద్ద కర్రతో కుక్కపై దాడి చేశారు. దీంతో అది రోడ్డు మీద పడిపోయింది. మరీ అది ప్రాణాలతో ఉందో లేదా అక్కడి నుంచి వెళ్లిపోయిందో కానీ.. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది.

Read more: Snake Video: అద్భుతం.. రెండు పాముల మీద తిరునామాలు, పూరీ జగన్నాథుడి కళ్లు.. అరుదైన వీడియో..

ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బహుశా కుక్కకు వెర్రి గానీ ఏదో అయి ఉంటుందని అంటున్నారు. అది పిల్లల్ని కాటు కొరికితే వారి సిట్యువేషన్ ఏంటని నెటిజన్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News