Gold Recycling ATM Video: చైనా ఎప్పటికప్పుడు కొత్తగా టెక్నాలజీని వినియోగించి కొత్త కొత్త మిషన్స్ ను తయారు చేస్తూ ఉంటుంది. వీటిని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. తాజాగా చైనా మొట్టమొదటి బంగారం రీసైక్లింగ్ ఏటీఎంను ప్రవేశపెట్టింది. ఈ మిషన్ ధర తమ బంగారు ఆభరణాలు తక్షణమే ఎక్స్చేంజ్ చేసి డబ్బుగా మార్చుకోవచ్చు. ఈ నూతన బంగారం రీసైక్లింగ్ మిషన్ ను షాంఘైలోని గ్లోబల్ హార్బర్ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేసినట్లు కింగ్‌హుడ్ గ్రూప్ తెలిపింది. అయితే దీనిని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ కింగ్‌హుడ్ గ్రూప్ అభివృద్ధి చేసి మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ప్రత్యేకమైన స్మార్ట్ మిషన్ చైనాలో మంచి ప్రజాదరణ పొందింది. ఇది బంగారం తూకం వేయడానికి, క్వాలిటీ స్కానింగ్ కోసం, కరిగించడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ మిషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
"బంగారు రీసైక్లింగ్ ATM" మిషన్ ద్వారా నేరుగా బంగారాన్ని కలిగించి డబ్బులు పొందవచ్చు. అయితే ఈ ఏటీఎం కనీసం 50% స్వచ్ఛతతో కూడిన మూడు గ్రాముల బంగారం కంటే ఎక్కువగా ఉండే మొక్కలను మాత్రమే తూకం వేసి డబ్బుగా అందిస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు కూడా విపరీతంగా పెరగడంతో.. ఈ యంత్రానికి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున జనాలు ఈ ఏటీఎం దగ్గరికి వచ్చి బంగారం అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో కంపెనీ ఏకంగా ప్రత్యేకమైన అపాయింట్మెంట్ స్లాట్ ను కూడా ఏర్పాటు చేసింది. బంగారాన్ని అమ్మాలనుకుంటున్నవారు స్లాట్ బుక్ చేసుకుని.. ఈ మిషన్ ద్వారా బంగారాన్ని కరిగించి డబ్బులు పొందవచ్చు.
A gold ATM in Shanghai, China
It melts the gold and transfers the amount corresponding to its weight to your bank account.
— Tansu Yegen (@TansuYegen) April 19, 2025
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఆంట్ వాంగ్ అని ఓ కస్టమర్ ఈ మిషన్లో దాదాపు 40 గ్రాముల నెక్లెస్ బంగారం ఆభరణం వేసింది. దీనికి మిషన్ లెక్క కట్టి రీసైకిలింగ్ చేసి మరి 30 నిమిషాల్లో చేతికి రూ.4.2 లక్షల రూపాయలను అందించింది. అయితే ఈ మిషన్ బంగారం క్వాలిటీని చెక్ చేసి డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ రోజు రేటు, బంగారం ప్యూరిటీని లెక్క కట్టి.. డబ్బులను అందించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ బంగారం రీసైకిలింగ్ చేసే మిషన్ డైరెక్ట్ డబ్బులు చేతికి అందించడం కాకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది.
ఈ బంగారం రీసైక్లింగ్ చేసే యంత్రానికి సంబంధించిన వీడియో చైనా వ్యాప్తంగా వైరల్ అవడంతో చాలామంది స్థానికులు అక్కడికి చేరుకొని బంగారాన్ని రీసైక్లింగ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అయితే మరికొంతమందికి మాత్రం ఈ మిషన్ అసౌకర్యంగా అనిపించింది. ఈ మిషన్ అందించే లెక్కలు అప్పుడప్పుడు తప్పుడుగా వస్తున్నాయని.. టెక్నికల్ ప్రాబ్లం కారణంగా చాలామంది తక్కువ డబ్బులు పొందారని వాపోతున్నారు. ఈ వీడియోను X (గతంలో ట్విట్టర్) నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









