Sengamalam Elephant winning cute hair style: సాధారణంగా గజరాజులు ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. కానీ ఇటీవల ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో మూకుమ్మడిగా వస్తున్నాయి. పంట పొలాల్ని నాశనం చేస్తున్నాయి. ఏనుగుల గుంపుల్ని చూసి కొన్ని గ్రామాల ప్రజలు భయంతో దూరంగా పారిపోతున్నారు. అంతే కాకుండా.. ఏనుగులు చాలా బలంగా ఉంటాయి. వాటిని మావటివాళ్లు కంట్రోల్ చేస్తుంటారు.
ఏనుగుల్ని దేవాలయాల్లో ఉత్సవాల సమయంలో తీసుకుని వెళ్తుంటారు. ఏనుగులు కొన్నిసార్లు భక్తులపై కోపంతో దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. అదే విధంగా ప్రస్తుతం ఏనుగుల్ని చాలా మంది దూరం నుంచి చూస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం ఏనుగుల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగుతూ.. వాటిని గెలికుతూ.. ఏదో ఒక విధంగా దాన్ని కోపం తెప్పిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఏనుగు తన హెయిర్ స్టైల్ వల్ల వార్తలలో నిలిచింది.
తమిళనాడులో సెంగమలం అనే ఓ ఏనుగు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఇది దాని.. సైజు చూసి కాదు, దాని బలంతో కూడా కాదు. కేవలం దాని స్టైలిష్ హెయిర్ కట్ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. సెంగమలం మన్నారుగుడిలోని రాజగోపాలస్వామి గుడిలో ఉంది. అక్కడ 2003 లో ఒక ఏనుగుని తీసుకొచ్చారు. అయితే.. దానికి నీట్ గా హెయిర్ కట్ చేయించారు.
ఈ గజరాజం ఫోటోను.. ఇండియా కల్చరల్ హబ్ అనే ఇన్‌స్టా పేజీలో సెంగమలం వీడియో పెట్టారో లేదో అది ఇట్టే వైరల్ అయిపోయింది.ఆ వీడియోలో సెంగమలం స్పెషల్ హెయిర్ కట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఏనుగుకు స్టైల్ గా కటింగ్ ను.. సెంగమలం మహావుత్ ఎస్.రాజగోపాల్ చేశాడు. తన గజరాజుకు ప్రేమగా, అందంగా కటింగ్ చేశాడు. ఇతను రోజుకు మూడు సార్లు తన ఏనుగుకు స్నానం చేయించి.. తన వెంట్రుకలకు షాంపు పూస్తాడు.
Read more: Viral Video: ఏంట్రా ఇది.. కొండ చిలువని పట్టుకుని స్కిప్పింగ్ ఆడుతున్న యువకులు.. వీడియో వైరల్...
ఈ ఎండాకాలంలో సెంగమలం చల్లగా ఉండటం కోసం ఏకంగా యాభై వేలు పెట్టి స్పెషల్ షవర్ కూడా పెట్టించారు. సెంగమలం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతున్నాయి.జనాలు ఆ హెయిర్ స్టైల్ కి ఫ్లాట్ అయిపోయారు. కొంత మంది ఏనుగు భలే స్మార్ట్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.









