)
Seven Headed Cobra Real Viral Video Watch: రోడ్డుపై అత్యంత అరుదైన నాగుపాము పడగవిప్పి నిలబడటం చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేసేస్తోంది. మనం ఇప్పటివరకు మూడు తలల పాములను, రెండు తలల పాములను చూసి ఉన్నాం.. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఏడు తలల పాము కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ఏడు తలల నాగుపామును కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. అయితే ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో? ఈ వీడియో వైరల్ గా మారడానికి కారణాలేంటో తెలుసుకోండి..
వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో అద్భుతమైన ఏడు తలలు కలిగిన నాగుపాము రోడ్డుపై ప్రత్యక్షమవడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ పామును చూసేందుకు భారీగా అక్కడికి స్థానికులు తరలివచ్చినట్టు కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ ఏడు తలల నాగుపామును చూసేందుకు రోడ్డుపై వెళ్తున్న కొంతమంది వాహనదారులు కూడా వారి వాహనాలను అక్కడే ఆపి దానిని చూడడం మీరు గమనించవచ్చు. అయితే, ఆ పాము వారిని గమనించి దాని తలలను ఒక్కొక్కటిగా కదిలించడం కూడా వీడియోలో మీరు క్లియర్‌గా చూడవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..
హిందూ పురాణాల్లో నాగుపాములకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి ప్రత్యేకమైన ఏడు తలలు కలిగిన నాగుపాములు కేవలం నాగలోకంలో మాత్రమే ఉంటాయని మనం అనేక పురాణాలకు సంబంధించిన గ్రంథాల్లో చదివి ఉంటాం. అయితే ఈ పాము ఇప్పుడు రోడ్డు పక్కన ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ వీడియో చూసిన కొంతమంది అయితే షాక్ కి గురవుతున్నారు. ఏడు తలల నాగుపాములు ఇప్పటికీ సినిమాల్లోనే చూసి ఉన్నాం. కానీ ఇలా రోడ్లపై కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు..
అసలు విషయం ఇదే..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఏడు తలలు కలిగిన నాకు పాము కు సంబంధించిన వీడియో చూసిన కొంతమంది ఇది నిజమైందని అనుకున్నారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలిసిన చాలామంది.. ఈ పాము నిజమైంది కాదని ఇది ఏఐ రూపొందించిన వీడియో అని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా టెక్నాలజీ పెరగడం కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు సంబంధించినవే ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. కొంతమంది ప్రజలు ఇలాంటి వీడియోలు చూసి నిజమైనవని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి ఆశ్చర్యం కలిగించే చాలా వీడియోలు AI రూపొందించినవేనని భావించవచ్చు. తాజాగా ఈ నాగుపాము కు సంబంధించిన ఫ్యాక్ చెక్ వివరాల కూడా వెల్లడించారు. ఇది అందులో కూడా AI రూపొందించిన వీడియోగా తేలింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి