Sheep Attacks on Woman Trending video Goes viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంకు గురిచేసేవిలా ఉంటాయి. అయితే ఫన్నీగా ఉండే వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే.. వీధుల్లో చాలా మంది ఆవుల్ని, మేకల్ని వదిలేస్తారు. అవి రోడ్డుపైన పడేసిన ఆహర పదార్థాల్ని తింటాయి.
కొంత మంది వీటికి ఏదైన ఆహరం వేస్తుంటారు. ఈ పదార్థాల్ని తింటూ అవి సంచరిస్తాయి. అయితే.. కొన్నిసార్లు ఇవి ఎదురు తిరిగి రోడ్డుపైన వెళ్తున్న అమాయకుల మీద దాడులకు కూడా దిగుతుంటాయి. ఇప్పటికే ఎద్దులు, శునకాలు ప్రజల మీద దాడులు చేసిన ఘటనలు మనం చూశాం. తాజాగా.. ఒక పొట్టెలు ఒక యువతికి ఉర్కించి చుక్కలు చూపించింది. ఈ వీడియో వైరల్గా మారింది.
ఒక యువతి చెతిలో ఏదో సంచి పట్టుకుంది. మరీ ఆ పొట్టెలుకు అది నచ్చలేదో లేక దానిలో దాని తినే పదార్థం ఉందో కానీ.. యువతిని పొట్టెలు మొత్తానికి ఉర్కించి, ఉర్కించి చుక్కలు చూపించింది. అంతే కాకుండా.. ఆమె అక్కడే ఉన్న ఒకచెట్టు మీదకు ఎక్కింది.
అయిన కూడా ఆ పొట్టెలు ఆమెను వదలకుండా పలుమార్లు ఆమె బ్యాక్ పార్ట్ ను తన కొమ్ములతో కుమ్మేసింది. ఇంకా ఆమె తన బలం అంతా కూడగట్టుకుని మరింత చెట్టుపైకి ఎక్కేసింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పొట్టేలు యువతిపై పగబట్టినట్లుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.









