Snakes lifespan: పాములు ఎంతకాలం జీవిస్తాయి, ఏ పాము ఎక్కువ కాలం బతుకుతుంది కారణాలేంటి

Snakes lifespan: పాములంటే భయపడనివారుండరు. ఆ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అత్యంత వేగంగా కాటేసి శక్తివంతమైన విషాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ప్రాణాలు పోతుంటాయి. అందుకే పాములంటే అందరికీ భయమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2025, 05:43 PM IST
Snakes lifespan: పాములు ఎంతకాలం జీవిస్తాయి, ఏ పాము ఎక్కువ కాలం బతుకుతుంది కారణాలేంటి

Snakes lifespan: ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. వేసవి వస్తే చాలు పాము కాటు కేసులు పెరుగుతుంటాయి. కారణం ఎండ వేడిమికి తట్టుకోలేక పగలంతా దాక్కునే పాములు సాయంత్రం బయటకు వస్తుంటాయి. అందుకే వేసవి సాయంత్రాలు బయట తిరిగేటప్పుడు పాముల భయం ఉండనే ఉంటుంది. అదే సమయంలో అసలు పాములు ఎన్నేళ్లు జీవిస్తాయి, ఏ పాము ఎక్కువ కాలం జీవిస్తుందనే ప్రశ్నలు తరచూ విన్పిస్తుంటాయి. 

Add Zee News as a Preferred Source

పాములు ఈ మధ్యకాలంలో మానవ నివాసాల్లో చొరబడిపోతున్నాయి. దాంతో మనుషుల చేతిలో లేదా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. చాలావరకు స్నేక్ క్యాచర్లు వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇలా మధ్యలో వివిధ కారణాల వల్ల చనిపోయేవి కాకుండా వాస్తవానికి ఎంతకాలం జీవిస్తాయనేది చాలామందికి తెలియదు. పాముల నిపుణులు చెప్పిన వివరాలు ఆశ్చర్యం కల్గిస్తాయి. పాముల సగటు జీవితకాలం 5 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. కొన్ని పాములు మాత్రం ఏకంగా 40 ఏళ్లు బతుకుతాయి. మనదేశంలో 270 కంటే ఎక్కువ పాము జాతులు ఉన్నాయి. సాధారణంగా పాముల ఆయుష్షు అవి జీవించే ప్రాంతాలను బట్టి ఉంటుంది. పాము జాతుల్ని బట్టి కూడా జీవితకాలం మారుతుంటుంది. 

దేశంలో అత్యధిక పాము జాతులు కన్పించేది కేరళ రాష్ట్రంలో. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో కూడా దాదాపుగా 40 రకాల పాములు ఉంటాయి. వీటిలో కోబ్రా, క్రైట్, పైథాన్, వైపర్ వంటివి ప్రమాదకరమైనవి. మనుషులు లేని ప్రాంతాల్లో అంటే అడవుల్లో నివసించే పాములు ఎక్కువ కాలం జీవిస్తాయి. అదే మానవ నివాసాల్లో ఉండే పాములు మాత్రం త్వరగా చనిపోతుంటాయి. మనుషులు నివసించే ప్రాంతాలు, పొలాల్లో ఉండే పాములు 8-10 ఏళ్లు నివసిస్తాయి. 

అదే కోబ్రా, క్రైట్స్, రస్సెల్ వైపర్లు, స్కేల్డ్ వైపర్లు వంటి పక్కా అడవి పాములు 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇవి చాలా వేగంగా వేటాడగలవు. మనుషులతో దూరంగా ఉంటుంది. దాంతో కచ్చితంగా ఇతర పాములతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తాయి

ఏ పాము ఎక్కువ కాలం జీవిస్తుంది

పాముల్లో విషపూరితం కానిదే అయితే అత్యంత భయంకరమైంది పైథాన్. ఇది ఎక్కువ కాలం జీవిస్తుంది. పైథాన్ పట్టు ఎంత బలంగా ఉంటుందంటే ఎంత పెద్ద జంతువునైనా చుట్టి ఊపిరాడకుండా చేయగలదు. ఇవి 25-40 ఏళ్లు బతకగలవు. పాము వయస్సుని సాధారణంగా పాము చర్మం, పొడవు, మెరుపు, వేగాన్ని బట్టి అంచనా వేస్తుంటారు. కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. పాము ఆకారం ఎంత పెద్దదైతే అంత ఎక్కువ కాలం జీవిస్తాయని చెప్పవచ్చు. 

Also read: NEET PG 2025 Exam Dates: నీట్ పీజీ 2025 పరీక్ష టైమ్ టేబుల్ విడుదల, ఈసారి రెండు షిఫ్టుల్లో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News