)
Snake Giving Birth Video: పాములు విషపూరిత జంతువులు వాటిని చూడగానే ఆమడ దూరం పారిపోతారు. సాధారణంగా పాములు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. చెట్ల పొదల్లో వీటి అవాసాలు చేసుకుంటాయి. ఈ వర్షాకాలంలో పాములు ఇళ్ల చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చేస్తున్నాయి. ఈ ఏసీ వెంట్ ద్వారా ఇళ్లలోకి వస్తాయి, అల్మారాలో కూడా ఎక్కడపడితే అక్కడ పాములు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సోషల్ మీడియాలో ఓ పాము వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.
సాధారణంగా మనం పాము గుడ్లు పెడతాయని వింటాం. కానీ ఈ పాము గుడ్లను కాదు ఏకంగా నడిరోడ్డుపై పిల్లల్ని పెట్టేసింది. పాము వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అది ఒక రోడ్డుపై క్రాస్ చేస్తూ వెళుతున్న సమయంలో అది పిల్లని పెట్టింది. స్థానికంగా ఉన్న వ్యక్తులు దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతూ ఉంది. ఎంతోమంది ఈ పాములకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు.
పాములకు సంబంధించిన వీడియో మీరు ఎప్పుడైనా చూశారా? ఇది ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. దీనికి రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విషపూరితమైన ఈ పాము వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా పాము కాటు వల్ల ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది ప్రాణాలు ప్రపంచవ్యాప్తంగా కోల్పోతున్నారు. అదే నిన్న మొన్నటి వరకు కేవలం చాలామంది పాము అంటే గుడ్లు పెడుతుంది అనుకుంటాం. అయితే, కొన్ని రకాల జాతులకు చెందిన పాములు పిల్లల్ని కూడా పెడతాయి. దీంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
పాములు మీ ఇంటి చుట్టూ దరిదాపుల్లోకి రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ భారీ వర్షాలు వరద కారణంగా పాములు ఇళ్లలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. మన ఇంటి చుట్టుముట్టు ప్రాంతాల్లో చెట్లు మొదళ్లలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని రకాల చెట్ల వల్ల కూడా ఇంటి చుట్టు పాములు వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి