Horrible Latur Bus Accident Video: మహారాష్ట్రలోని లాతూర్‌లో నిన్న ఎస్టీ బస్సు ప్రమాదవశాత్త బోల్తా పడింది. ఈ బస్సుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ బైకర్‌ను తప్పించబోయి ఈ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 38 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగపూర్ నుంచి రత్నగిరి హైవేపై ఓ బస్సు వెళ్తూ ఉంది. అయితే, అదే దారిన వస్తున్న ఓ బైకర్ బస్సును క్రాస్ చేసి యూటర్న్ చేయబోయాడు. బస్సు దగ్గరగా వచ్చేయడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బైకర్‌ను హిట్ చేయకుండా ఉండేందుకు తప్పించబోయాడు. దీంతో డివైడర్‌కు అటు రోడ్డున దాటి వెళ్లిపోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో ఆ రోడ్డు వైపుగా ఇతర ఏ వాహనాలు రాలేదు. దీంతో ప్రమాదం మరింత తీవ్రతరం కాలేదు. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక సదరు ద్విచక్ర వాహనదారుడు మాత్రం మళ్లీ ఆ రోడ్డు మార్గం గుండానే దాటకుండా ఓ పక్కకు ఆగిపోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెంటనే చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే, డివిజనల్ ట్రాఫిక్ ఆఫీసర్ అయిన సందీప్ పడ్వాల్ ప్రకారం.. ఈ ప్రమాదంలో దాదాపు 38 మంది వరకు గాయపడ్డారు. అందులో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వీరిని స్థానిక ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో పలువురి చేతి వేళ్లు కూడా తేగి పడిపోయాయి. అంతేకాదు మరికొందరి ఎముకలు కూడా విరిగినట్లు సమాచారం. ప్రమాదత స్థలం కూడా చూడటానికి అత్యంత భయానకంగా మారింది. లాతూర్‌లోని సర్వోపచార్ ఆసుపత్రిలో గాయపడినవారిని చేర్పించారు. జిల్లా కలెక్టర్ వర్ష ఠాకూర్ ఘూగే కూడా ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: Video Viral: డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు వీడియో వైరల్! అసలు విషయం తెలిస్తే..
ఈ బస్సు అహ్మదాబాద్ నుంచి లాతూర్ వైపుగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు పోలీసు అధికారి చెప్పారు. ప్రధానంగా బస్సు డ్రైవర్ వీల్ కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. అయితే, ప్రత్యక్ష సాక్షులు కొందరు బస్సు అతివేగంతో నడిపినిందుకే ఈ ప్రమాదం జరిగింది.. అందుకే బస్సు నిలిపివేసే క్రమంలో స్కిడ్ అయిందని చెబుతున్నారు. ఇక బస్సులో మొత్తం 48 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. అందులో ఆడవాళ్లతోపాటు పరీక్ష రాయడానికి వెళ్లి వస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఈ రోడ్డుగుండా ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు జరిగాయని సమాచారం. ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు.
Indisciplined biker topples state transport bus along Latur-Nanded Highway, Maharashtra. 37 injured. pic.twitter.com/i9RzRRW1N5
— Rajendra B. Aklekar (@rajtoday) March 4, 2025
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









