)
Snake Catching Laptop Camera Video Watch: సోషల్ మీడియాల్లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా చూడడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేస్తారు. ముఖ్యంగా సాహసోపేతమైన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతాయి. తాజా కూడా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన చాలా మంది ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతారు. నిజానికి ఈ వీడియోలో ఏం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ట్రై టుడే అమ్మ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో నాగదేవత పుట్టలో నిజంగా పాము ఉంటుందా? అనే అంశాన్ని వీడియోగా పాముల పుట్టలో కెమెరా పెట్టి మరీ చూపించారు. సాధారణంగా ఇలా ఎవరూ చేయడానికి సాహసించని విధంగా.. పాము పుట్టలో ఏం దాగి ఉందో తెలుసుకోఓవడానికి వారు ఏకంగా పుట్టలోకే ప్రత్యేకమైన కెమెరాను పంపారు. ఈ వీడియోను ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు.
ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ గుడి దగ్గర ఉన్న పాములు ఉండే బొరియలోని లోపలి భాగంలో ఎండోస్కోపి అనే ప్రత్యేకమైన కెమెరాను లోపిలికి పంపించి.. ఎందులో పాములు ఉన్నాయో అని తెలుసుకోవడం ప్రారంభించారు. అయితే, ముందుగా ఓ పుట్టలో పంపగా.. అందులో ఎలాంటి పాము లేదని తెలిసి వచ్చింది. చివరి వారు ఇంకో పుట్టలోకి పామును పంపంగా ఊహించని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఎండోస్కోపి కెమెరా లోపలికి పంపంగా.. వారికి లోపల ఓ పెద్ద పాము చుట్టుకుని పడుకుని ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా వీడియోలో ఆ పాము ఏలాంటి కదలికలు లేకపోయినప్పటికీ.. చివరిగా కదులుతున్నట్లు కనిపించింది. పుట్టలో వారు చూపిస్తున్న పామును నాగదేవతని అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా ఈ పుట్టలోనే పాముతో పాటు నత్తలు, ఎలుకలకు చెందిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.
ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది పాము నివసించే చోట కెమెరాను పెట్టి వాటికి భంగం కలిగించడం చాలా తప్పని కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అందరికీ నాగదేవత ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook