Smallest Rare Goat Viral Video: ప్రపంచంలోనే అతి చిన్న మేక.. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..

Smallest Rare Goat Viral Video Watch Here: ప్రపంచంలో ఎన్నో జాతులకు సంబంధించిన మేకలు ఉన్నాయి. అందులో అతి చిన్న జాతికి సంబంధించిన మేకను చూశారా? చూడని వారు ఈ వీడియో ద్వారా చూడండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 28, 2025, 02:34 PM IST
Smallest Rare Goat Viral Video: ప్రపంచంలోనే అతి చిన్న మేక.. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి..

Smallest Rare Goat Viral Video: ప్రపంచంలోని ఒక్కొక్కరి ఎత్తు ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ సమానంగా ఉండాలనే రూల్‌ కూడా లేదు.. పుట్టినప్పటి నుంచి పెరిగే దాకా మనం చేసే పనులపై కూడా ఎత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది చాలా పొడవుగా ఉంటే.. మరికొంతమంది చాలా పొట్టిగా ఉంటారు. జంతువులు కూడా ఇలానే ఉంటాయి. కొన్ని జంతువులు పొడవుగా ఉంటే.. మరికొన్ని జంతువుకు చాలా పొట్టిగా ఉంటాయి. తాజాగా అత్యంత పొట్టిగా ఉండే ఓ జంతువు గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియో గిన్నిస్‌ రికార్డ్‌ సోషల్ మీడియా నుంచి పోస్ట్‌ చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

సాధారణంగా మేకలను మనం గ్రమాల్లో విభిన్న రంగుల్లో చూస్తూ ఉంటాం.. ఇందులో కొన్ని పొడవుగా ఉంటే మరికొన్ని చాలా  పొట్టిగా ఉంటాయి. కానీ ఇటీవలే గిన్నిస్‌ రికార్డ్‌ ఖాతా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసిన వీడియోలో మేక చాలా చిన్నగానూ, పొట్టిగానూ ఉంది. దీనిని చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఈ మేక ప్రపంచంలోనే అత్యంత పొట్టి మేక(Smallest Rare Goat)గా రికార్డు కూడా సృష్టించింది. దీనిని కేరళకు చెందిన ఓ రైతు గత కొన్ని ఏళ్లుగా పెంచుతున్నాడు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి పెంచుతూ ఉన్నప్పటికీ ఎత్తులో ఎలాంటి మార్పులు లేకపోయింది.

కేరళ రైతు తెలిపిన వివరాల ప్రకారం, ఈ అరుదైన మేక పిగ్మీ జాతికి చెందిందని తెలిపారు. అంతేకాకుండా ఇది ఆడ మేకని.. త్వరలోనే పిల్లలను కూడా పెడుతుందని ఆయన అన్నారు. ఈ మేక జాతి (Smallest Goat)అన్ని జాతుల కంటే చాలా అందంగా ఉంటాయని సమాచారం. అలాగే ఇది కేవలం 1.3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మేక వయస్సు 4 సంవత్సరాలని తెలిపారు. ఇది 2021 సంవత్సరంలో జన్మించిందని ఆయన తెలిపారు. ఇప్పటికీ అతిడి దగ్గర దాదాపు మూడు మేకలు ఉన్నాయని అందులో ఈ మేక చాలా మరగుజ్జుని అతడు వెల్లడించారు. దీని పరిమాణం కూడా చాలా చిన్నదిగా ఉండడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

ఈ మేకకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) ఇస్టాగ్రామ్‌ ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించారు. అయితే దీనిని వారు వరల్డ్‌లోనే అత్యంత చిన్న కురుంబిని అని క్యాప్షన్‌ రాసి పోస్ట్ చేశారు. దీనిని మార్చి 20న షేర్‌ చేశారు. కొంతమంది ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ నైజీరియాలో ఇలాంటి మేకలు చాలా ఉన్నాయని కామెంట్స్‌ చేస్తున్నారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News