Smooch Cabs Bangalore: తరచుగా పార్కులు, రైళ్లు, బస్సులు, బస్టాండ్స్‌లో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బంహిరంగా ప్రదేశాలని చూడకుండా మరీ రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం ఆప్డేట్ అయ్యారు. వీటన్నింటికీ బిన్నంగా ఆలోచించి ఏకంగా క్యాబ్ బుక్ చేసుకుని రొమాన్స్ చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది డ్రైవర్స్ ఇలాంటి సంఘటనలు చూసి విసిగిపోయి.. ఏకంగా కార్లలో బోడ్లు కూడా పెట్టేశారు. అయితే కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ వీరి గురించి పూర్తిగా ఆలోచించి.. స్మూచ్ క్యాబ్స్ సర్వీసులు ప్రారంభించారని సమాచారం. ఈ క్యాబ్స్‌లో ప్రేముకులు ఎలాంటి భయం, అడ్డంకులు లేకుడా నచ్చినట్లు ప్రయాణించవచ్చట..
ఇదిలా ఉంటే కొంతమంది ఆటో, ట్యాక్స్ డ్రైవర్స్ ఇది కేవలం క్యాబ్ మాత్రమే.. శృంగారం చేసుకోవడానికి గది కాదని నోట్ బోర్డులు కూడా పెడుతున్నారు. ఇలాంటి నోటిస్ బోర్డులకు సంబంధించిన, అనేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని, బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ కొత్త స్మూచ్ క్యాబ్ సర్వీస్‌లను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎవరైన సులభంగా ప్రయాణం చేయోచ్చని, ముఖ్యంగా ప్రేమికులైతే కౌగిలించుకుని హాయిగా ప్రయాణం చేసే సదుపాయాన్ని అందిస్తోందని స్మూచ్ క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. ప్రేమికులు వారి భాగస్వామితో ప్రైవేటు సమయం గడపాలనుకునేవారు ఈ క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు.
ఈ క్యాబ్‌లో ప్రత్యేకతలు..
ఈ స్మూచ్ క్యాబ్‌లో భాగంగా కంపెనీ అనేక ప్రత్యేకలతో కూడిన ఫీచర్స్‌ను తీసుకు వచ్చిది. ఈ క్యాబ్స్ బుక్ చేసుకునేవారు తమ గమ్యాన్ని ఓలా, ఉబర్ లేదా రాపిడో కంటే స్పీడ్‌గా చేర్చుతుంది. అంతేకాకుండా బుక్ చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే మీరు పెట్టిన లోకేషన్‌కి చేరుతుంది. ఈ క్యాబ్‌లను ప్రత్యేకంగా ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేశారు.. కాబట్టి వారి కోసం, కొన్ని ఫీచర్స్‌ను త్వరలోనే అందించబోతున్నారు. ఈ క్యాబ్ సర్వీస్‌లో ప్రత్యేకమైన పాలసీ ఆప్షన్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో డోంట్ డిస్టర్బ్ పాలసీ ఏర్పాటు చేశారు. లోపల మనులుషులు కనబడకుండా ప్రత్యేకమైన కర్టెన్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వెనక సీట్లలో జంట కనిపించకుండా ప్రత్యేకమైన కర్టెన్లను కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు.
క్యాబ్ రైడ్ ఖరీదు చీపే.?
ఈ క్యాబ్స్‌లో ప్రయాణించాలనుకునేవారు ఎక్కువ ధరలు చూడరు.. వారికి కావాల్సిందల్లా ప్రైవసీనే.. కాబట్టి ధరలేంతనై పెడుతూ ఉంటారు. కానీ ఈ స్మూచ్ క్యాబ్ ధర మీరు ప్రయాణం చేయాల్సిన డిస్టెన్స్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇతర కంపెనీ సర్వీసుల కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి క్యాబ్ సర్వీస్ ఉందంటే మీరు నమ్ముతున్నారా? ఇలాంటి క్యాబ్ సర్వీసులు నడపడం చాలా రిస్క్.. అయితే ఈ స్టోరీ కేవలం ఏప్రిల్ ఫూల్ అని..స్మూచ్ క్యాబ్ పేరుతో ఏప్రిల్ ఫూల్ అయ్యారు..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









