King Cobra Video Bathing Video Watch: కింగ్ కోబ్రాకు సంబంధించిన పాముల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్ని రకాలు సంబంధించిన పాములు చాలా డేంజర్.. ఇందులో గిరి నాగుపాములైతే మరి ప్రమాదం.. అయితే నాగుపాముల్లో ఇండియన్ కింగ్ కోబ్రాలు కాస్త నిదానత్వం కలిగి ఉంటాయట. కానీ ఈ రెండు పాములు కాటేస్తే తప్పకుండా మరణించడం ఖాయం.. ఈ రెండు పాములు ఎలాపిడే జాతికి సంబంధించినవే.. అయితే ఈ జాతి నుంచి పుట్టుకుని వచ్చిన పాముల్లో గిరి నాగుపాము మొదటి రకానికి సంబంధించినది. ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి..
గిరినాగు పాముల శరీరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీటి శరీరం మొత్తం ప్రత్యేకమైన పొలుసును కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ పాములు చాలా ప్రత్యేకమైన ఇందులోని ఆడ జాతికి సంబంధించిన పాములు గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తాయి. అయితే ఈ పాములు ఆడవులతో కూడిన నదీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికీ అమెజాన్ ఆడవుల్లో ఈ పాములు వేల కొద్ది నివసిస్తున్నాయి. అలాగే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ పాములు కనిపిస్తునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి పాములు ఇళ్లలోకి సంచారం చేసే క్రమంలో తీసిన అనేక వీడియో వైరల్ అవుతూ వచ్చాయి.
గిరినాగుకు సంబంధించిన చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాములుగా వైరల్ అవ్వడం లేదు. ఈ వీడియోలో మాత్రం గిరినాగుకు సంబంధించిన అరుదైన దృష్యాలు చూడొచ్చు. వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ భారీ గిరినాగు ఒక బకెట్లో మునిగి ఉండడం చూడవచ్చు. అంతేకాకుండా ఈ బకెట్లో అటు ఇటు కదలం కూడా గమనించవచ్చు.
బకెట్‌లో గిరినాగు ఉందని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్స్ సమాచారం అందించగా.. వారు అక్కడి చేరుకుని, దానిని పట్టుకునేందుకు ప్రత్నించారు. ఆ స్నేక్ క్యాచర్ బకెట్‌లో ఉన్న పామును పట్టుకుని, సురక్షితమైన ప్రదేశానికి తరిలించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ పాము వేసవి ఉష్ణోగ్రతను తట్టుకోలేక చల్లదనం కోసం నీరు కలిగిన బకెట్‌లోకి దిగిందని అక్కడున్నవారు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో @shatrudhanbabasharpmitra.9733 అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పై నెటిజన్స్ వీక్షించారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









